Microsoft: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..వారంలో మూడు రోజులు ఆఫీసు తప్పనిసరి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా ముగింపు పలుకుతున్నాయి. ఈ క్రమంలో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా పెద్ద నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు హాజరు కావాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది.

Update: 2025-09-10 07:12 GMT

మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ పీపుల్ ఆఫీసర్‌ అమీ కోల్‌మాన్ వివరాల ప్రకారం, ఈ కొత్త విధానాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదట వాషింగ్టన్‌ రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభించి, క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫీసుల్లో అమలు చేస్తారని తెలిపారు.

దీంతో, ఇప్పటి వరకు ఇంటి నుంచే పనిచేసిన ఉద్యోగులు మళ్లీ కార్యాలయ వాతావరణంలో భాగమవ్వాల్సి ఉండనుంది.

Tags:    

Similar News