Microsoft CEO Satya Nadella: జీపీటీ-5తో పనులు సులువయ్యాయి.. నా టాప్-5 ప్రాంప్ట్స్ ఇవే!

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన రోజువారీ పనులు మరింత ఈజీ అయ్యాయని చెబుతున్నారు. కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న జీపీటీ-5. మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌తో అనుసంధానమైన ఈ టూల్ ఇప్పుడు తన వర్క్ లైఫ్‌లో ఒక ముఖ్య భాగమైందని ఆయన పేర్కొన్నారు.

Update: 2025-08-28 15:00 GMT

Microsoft CEO Satya Nadella: జీపీటీ-5తో పనులు సులువయ్యాయి.. నా టాప్-5 ప్రాంప్ట్స్ ఇవే!

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన రోజువారీ పనులు మరింత ఈజీ అయ్యాయని చెబుతున్నారు. కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న జీపీటీ-5. మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌తో అనుసంధానమైన ఈ టూల్ ఇప్పుడు తన వర్క్ లైఫ్‌లో ఒక ముఖ్య భాగమైందని ఆయన పేర్కొన్నారు. మీటింగ్స్, ఇమెయిల్స్, ప్రాజెక్ట్ అప్‌డేట్స్‌ వంటి విషయాలను తాను జీపీటీ-5 సహాయంతో చక్కబెడుతున్నానని తెలిపారు. అవుట్‌లుక్, టీమ్స్, వర్డ్, ఎక్సెల్ వంటి యాప్స్ నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి, స్పష్టమైన సూచనలు ఇస్తోందని చెప్పారు.

సత్య నాదెళ్ల ఎక్కువగా ఉపయోగించే టాప్ 5 ప్రాంప్ట్స్ ఇవే:

మీటింగ్ టాపిక్స్ ప్రాంప్ట్:

“మన మునుపటి సంభాషణల ఆధారంగా వచ్చే మీటింగ్‌లో చర్చించాల్సిన 5 ప్రధాన అంశాలను ఇవ్వు.”

గత ఇమెయిల్స్‌, చాట్స్‌, మీటింగ్స్ అన్నింటినీ స్కాన్ చేసి జీపీటీ-5 ముఖ్యమైన చర్చ విషయాలను సూచిస్తోంది.

ప్రాజెక్ట్ అప్‌డేట్ ప్రాంప్ట్:

“ఇమెయిల్స్‌, చాట్స్‌, మీటింగ్స్‌ ఆధారంగా ప్రాజెక్ట్ అప్‌డేట్ తయారు చెయ్యి.”

 KPIs vs టార్గెట్లు, విజయాలు, అపజయాలు, రిస్కులు, పోటీదారుల కదలికలు – అన్నీ సమీక్షించి క్లారిటీ ఇస్తోంది. కఠినమైన ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు కూడా సూచిస్తోంది.

ప్రొడక్ట్ లాంచ్ ప్రాంప్ట్:

“నవంబర్ ప్రొడక్ట్ లాంచ్ సిద్ధత ఎక్కడ ఉంది? ఇంజినీరింగ్ పురోగతి, పైలట్ ఫలితాలు, లాంచ్ ప్రాబబిలిటీ చెప్పు.”

లాంచ్ ట్రాక్‌లో ఉందా లేదా అనేది విశ్లేషించి, వెనకబడి ఉన్న పాయింట్లు, ముందుగా దృష్టి పెట్టాల్సిన అంశాలు తెలియజేస్తోంది.

టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాంప్ట్:

“నా గత నెల క్యాలెండర్‌, ఇమెయిల్స్‌ను సమీక్షించి ఎక్కువ సమయం వెచ్చించిన ప్రాజెక్టులను 5-7 బకెట్లలో విభజించు.”

ఏ అంశంపై ఎంత సమయం వెచ్చించామో చెప్పి టైమ్ మేనేజ్‌మెంట్‌లో సాయం చేస్తోంది.

మీటింగ్ ప్రిపరేషన్ ప్రాంప్ట్:

“గత టీమ్ చర్చలు, మేనేజర్ మీటింగ్స్ ఆధారంగా నాకు వచ్చే మీటింగ్ కోసం అవసరమైన పాయింట్లు చెప్పు.”

ఇమెయిల్ డేటాను విశ్లేషించి, రాబోయే మీటింగ్‌లో చర్చించాల్సిన ముఖ్య విషయాలను అందిస్తోంది.

సత్య నాదెళ్ల ప్రకారం, జీపీటీ-5 వలన తన పనులు వేగంగా, సమర్థవంతంగా జరుగుతున్నాయి.

Tags:    

Similar News