Youtube : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్
Youtube : గూగుల్ సంస్థ యూట్యూబ్ కోసం మోనిటైజేషన్ పాలసీలో నేటి నుంచి ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది.
Youtube : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్
Youtube : గూగుల్ సంస్థ యూట్యూబ్ కోసం మోనిటైజేషన్ పాలసీలో నేటి నుంచి ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఈ మార్పు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కు సంబంధించింది. ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశ్యం. ఒకే రకమైన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోందని చాలామంది ఫిర్యాదులు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏఐ వీడియోలు చేసేవారికి దెబ్బ
ఈరోజు నుంచి యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలను కఠినతరం చేసింది. కొత్త నియమాల ప్రకారం, రిపిటిటివ్, మాస్-ప్రొడ్యూస్డ్ కంటెంట్ ఉన్న ఛానెళ్ల యాడ్ రెవెన్యూ తగ్గుతుంది. యూట్యూబ్ ఏఐ అని నేరుగా చెప్పకపోయినా, ఈ మార్పు ఏఐ వీడియోలు పోస్ట్ చేసేవారిని టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల ఏఐతో వీడియోలు చేసి పోస్ట్ చేసేవారి సంపాదనపై ప్రభావం పడుతుంది. ఈ మార్పు వల్ల మోనిటైజేషన్ షరతులలో ఎలాంటి మార్పు లేదు.
యూట్యూబ్ మోనిటైజేషన్ షరతులు
మీ ఛానెల్‌ను మోనిటైజ్ చేయాలంటే, గతంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా 1,000 కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లు ఉండాలి. దీనితో పాటుగా, 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజులలో కోటి షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ షరతులకు అదనంగా, ఇప్పుడు యూట్యూబ్ మరో షరతును కూడా చేర్చింది.. మీ కంటెంట్ ఒరిజినల్, అథెంటిక్ గా ఉండాలి.
ఈ మార్పు ఎందుకంటే?
యూట్యూబ్ ఈ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం, ఏఐ, స్పామ్ కంటెంట్ సంఖ్యను తగ్గించి, ఒరిజినల్ కంటెంట్‌పై ప్రజల దృష్టిని పెంచడం. మీరు ఏఐ వీడియోలతో మంచి వ్యూస్ సంపాదిస్తున్నప్పటికీ, మీ కంటెంట్ ఒరిజినల్ కాకపోతే, మీ యాడ్ రెవెన్యూ తగ్గుతుంది లేదా మీ ఛానెల్ డిమోనిటైజ్ కావచ్చు.