Kodak Smart TV: చౌక ధరలో కొత్త QLED టీవీలను విడుదల చేసిన కొడాక్!
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ కొడాక్ భారత మార్కెట్‌లో తక్కువ ధరకు అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ప్రత్యేక ఎడిషన్‌గా తీసుకొచ్చిన ఈ టీవీలు 24, 32, 40 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి.
Kodak Smart TV: చౌక ధరలో కొత్త QLED టీవీలను విడుదల చేసిన కొడాక్!
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ కొడాక్ భారత మార్కెట్‌లో తక్కువ ధరకు అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ప్రత్యేక ఎడిషన్‌గా తీసుకొచ్చిన ఈ టీవీలు 24, 32, 40 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల ధరలు ₹6,399 నుంచి ప్రారంభమవుతుండగా, జూలై 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యే GOAT సేల్‌లో 24 అంగుళాల మోడల్‌ను ప్రత్యేక ఆఫర్ ధరగా ₹5,999కి కొనుగోలు చేయవచ్చు.
కొడాక్ తాజా టీవీలు లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండగా, క్వాడ్-కోర్ A35 ప్రాసెసర్, 36W స్పీకర్లు (32 & 40 అంగుళాల వేరియంట్‌లకు మాత్రమే), బెజెల్‌లెస్ డిజైన్ వంటి ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. YouTube, JioCinema, Sony Liv, Prime Video, Zee5 వంటి పాప్‌లర్ OTT యాప్స్‌ను ప్రీ-లోడెడ్‌గా అందించడంతో పాటు, HDMI, USB, Wi-Fi, Miracast కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రిమోట్‌లో ప్రత్యేక యూట్యూబ్ బటన్, ఇన్‌బిల్ట్ గేమ్స్, లైవ్ ఛానెల్స్ వంటి సౌకర్యాలతో ఈ టీవీలు బడ్జెట్‌లో బెస్ట్ ఎంపికగా నిలుస్తున్నాయి.