Jiostar: జియోస్టార్‌ కీలక నిర్ణయం.. యూట్యూబ్‌ నుంచి కంటెంట్‌ తొలగింపు..!

Jiostar: ఓటీటీ రంగంలో విస్తరిస్తున్న జియోస్టార్ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. యూజర్లను పెంచుకోవడమే లక్ష్యంగా, వీడియో కంటెంట్‌ ప్రదర్శనలో కీలక మార్పులు చేయనుంది.

Update: 2025-03-14 08:30 GMT

Jiostar: జియోస్టార్‌ కీలక నిర్ణయం.. యూట్యూబ్‌ నుంచి కంటెంట్‌ తొలగింపు..!

Jiostar: ఓటీటీ రంగంలో విస్తరిస్తున్న జియోస్టార్ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. యూజర్లను పెంచుకోవడమే లక్ష్యంగా, వీడియో కంటెంట్‌ ప్రదర్శనలో కీలక మార్పులు చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం అందిస్తున్న వినోదాత్మక వీడియోలను తొలగించేందుకు సంస్థ యోచనలో ఉంది. మే 1వ తేదీ నుంచి ఈ చర్య అమలులోకి వచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వ్యూహంలో భాగంగా జియోస్టార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఉచితంగా అందించిన కంటెంట్‌ యూట్యూబ్‌లో ఉండటం వల్ల తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారుల ఆకర్షణ తగ్గుతోందని జియో స్టార్‌ భావిస్తోంది. అందుకే ఇకపై కంటెంట్‌ను తమ స్వంత యాప్‌ లేదా వెబ్‌ వేదికలకే పరిమితం చేయాలనుకుంటోంది.

కాగా.. రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనంతో ఏర్పడిన 'జియోస్టార్' జాయింట్ వెంచర్‌ జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఇవి కలిసి ‘జియో హాట్‌స్టార్’ పేరిట వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. విలీనానికి ముందు హాట్‌స్టార్‌ ద్వారా క్రీడలు, సినిమాలు, సిరీస్‌ల వంటి ప్రీమియం కంటెంట్‌ను ఉచితంగా అందించగా, ఇప్పుడు వాటిపై సబ్‌స్క్రిప్షన్ విధానం అమలులోకి వచ్చింది.

ఇది వినియోగదారుల నుంచి మిక్స్‌డ్ స్పందనను తెచ్చుకున్నా, సంస్థ మాత్రం దీన్ని వ్యూహాత్మక ముందడుగుగా చూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, జియోస్టార్‌ తన కంటెంట్‌ను ప్రాధాన్యంగా ఓటీటీ యాప్‌లకే పరిమితం చేసి, ప్రత్యక్ష ఆదాయ మార్గాలను బలోపేతం చేయాలనుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంభవించవచ్చు.

Tags:    

Similar News