జియో బంపర్ ఆఫర్: రూ.349కే సరికొత్త స్టార్టర్ ప్యాక్ – 5G, జియోఫైబర్, హాట్‌స్టార్ ఉచితం!

ఇటీవల రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన స్టార్టర్ ప్యాక్ డిజిటల్ వినియోగదారులకు గొప్ప అవకాశం. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాక్‌ ధర కేవలం రూ.349 మాత్రమే.

Update: 2025-06-17 13:03 GMT

జియో బంపర్ ఆఫర్: రూ.349కే సరికొత్త స్టార్టర్ ప్యాక్ – 5G, జియోఫైబర్, హాట్‌స్టార్ ఉచితం!

 Jio starter pack : ఇటీవల రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన స్టార్టర్ ప్యాక్ డిజిటల్ వినియోగదారులకు గొప్ప అవకాశం. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాక్‌ ధర కేవలం రూ.349 మాత్రమే. ఇది ఒకే ఆఫర్‌లో అనేక డిజిటల్ సేవలను అందిస్తూ వినియోగదారులకు సులభతరమైన డిజిటల్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

ఈ స్టార్టర్ ప్యాక్‌తో వినియోగదారులు 28 రోజుల పాటు అపరిమిత 5G సేవలు పొందవచ్చు. అంతేకాదు, ఇంటికి 50 రోజుల పాటు జియోఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్‌ లభిస్తుంది. ఇందులో టీవీ, వైఫై మరియు ప్రముఖ OTT యాప్‌ల యాక్సెస్‌ కూడా ఉంటుంది. అదనంగా, 50 జీబీ ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజ్ కూడా అందుతుంది. వినియోగదారులు 90 రోజుల పాటు 4K నాణ్యతలో టీవీ లేదా మొబైల్‌లో జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఆఫర్ ప్రత్యేకించి కొత్త మొబైల్ యూజర్లను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రూపొందించబడింది. డేటా, ఇంటర్నెట్, OTT, క్లౌడ్ స్టోరేజ్ లాంటి అన్ని ముఖ్యమైన సేవలను ఒకే ప్యాక్‌లో అందించడం ద్వారా వినియోగదారులకు అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా జియో ముందడుగు వేసింది.

ఇదిలా ఉండగా, జియో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రాయ్ (TRAI) ఏప్రిల్ 2025 నివేదిక ప్రకారం, జియో భారీగా సబ్‌స్క్రైబర్లను జోడించడంలో ముందంజలో ఉంది. మొబైల్ విభాగంలో ఏప్రిల్‌లో 95,310 కొత్త సబ్‌స్క్రైబర్లు జోడించగా, మొత్తం వినియోగదారుల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. అలాగే జియోఫైబర్ కూడా అదే నెలలో 54,000కి పైగా కొత్త వినియోగదారులను పొందగలిగింది. 5G ఎయిర్‌ఫైబర్ విభాగంలో జియో దేశవ్యాప్తంగా 6.14 మిలియన్లకు పైగా వినియోగదారులతో దూసుకుపోతోంది. వీరిలో అధికభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనే ఉన్నారు.

అత్యంత వేగంగా విస్తరిస్తున్న 5G FWA (Fixed Wireless Access) విభాగంలో జియో స్పష్టమైన మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. గ్రామీణ, సెమీపట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తృతంగా అందించడంలో జియో పోటీ సంస్థలకంటే ముందుంది. వీటికి కారణం అధునాతన 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ధరల పరంగా సరసత్వం మరియు విస్తృతమైన అందుబాటు.

ఈ ప్రస్తావించిన స్టార్టర్ ప్యాక్‌తో జియో, డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కొత్త మొబైల్ వినియోగదారులకు ఇది మరొక అద్భుతమైన ఆఫర్‌గా నిలుస్తోంది.

Tags:    

Similar News