Jio: జియో ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్.. ఇక యాడ్స్ లేకుండానే ఫుల్ ఎంటర్టైన్మెంట్..!
Jio Ads Free Youtube: ప్రైవేటు దిగ్గజ కంపెనీ జియో కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు, పోస్ట్‌పెయిడ్, ఫైబర్ సేవలను కూడా అందిస్తుంది. తాజాగా యూట్యూబ్ యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం కూడా కల్పిస్తోంది.
Jio: జియో ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్.. ఇక యాడ్స్ లేకుండానే ఫుల్ ఎంటర్టైన్మెంట్..!
Jio Ads Free YouTube: రిలయన్స్ జియో ప్రైవేటు దిగ్జజ కంపెనీ బ్రాడ్ బ్యాండ్, ఎయిర్ ఫైబర్ వంటి సౌకర్యాలను కల్పిస్తుంది. మరోవైపు ప్రీపెయిడ్ కస్టమర్లను కొత్త రీఛార్జ్ ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. ఇక జియో తమ కస్టమర్ల కోసం రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ యాక్సెస్ చేయవచ్చు. దీనికి అదనంగా డబ్బు ఖర్చు లేకుండా యూట్యూబ్ యాడ్స్ లేకుండా ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.
జియో రీఛార్జ్ ప్లాన్ తో మీరు యాడ్స్ చూడకుండానే ఇక ఎంటర్టైన్మెంట్ ఆస్వాదించవచ్చు. ఈ జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ. 1499 ప్లాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో మీరు రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్ యాక్సెస చేయవచ్చు. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, యూట్యూబ్ ప్రీమియం వంటి సబ్స్క్రిప్షన్ లో కూడా జియో అందిస్తోంది.
ఈ ప్లాన్ తో మీరు రీఛార్జీ చేసుకుంటే 15 ఓటీటీలతో పాటు 300 ఎంబీబీపీఎస్ నెట్ స్పీడ్ ఉంటుంది. అపరిమిత డేటా ఉచిత వాయిస్ కాలింగ్, 800 కంటే ఎక్కువ టీవీ చానల్స్ వీక్షించే అవకాశం ఉంది. ఈ ప్లాన్ లో మీరు మూడు లేదా 6 లేదా 12 నెలలు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
అయితే ఇతర కంపెనీలో కూడా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ మాత్రం లేదు. యాడ్స్ లేకుండా యూట్యూబ్ ని వీక్షించాలని సబ్స్క్రైబ్ లకు ఇది బెస్ట్ ఆప్షన్. బ్యాక్ గ్రౌండ్ ప్లే, యూట్యూబ్ మ్యూజిక్, వీడియో డౌన్లోడ్ సౌకర్యాన్ని కూడా మీరు పొందుతారు. అయితే, కొన్ని రీఛార్జీ ప్యాక్‌లతో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ పొందే అవకాశం కూడా జియో కల్పిస్తోంది.
జూలై నెలలో టెలికాం ధరలను పెంచడంతో ఎక్కువ శాతం మంది జియో కస్టమర్‌లు ఇతర టెలికాం కంపెనీలకు పోర్ట్ అయ్యారు. ఈ నేసథ్యంలో జియో వారిని తిరిగి రాబట్టేందుకు ఇలా ఆకర్షణీయమైన ప్లాన్స్ తీసుకువస్తుంది.