iQOO Neo 10 Pro Plus Launch: కళ్లు చెదిరే ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా..?
iQOO Neo 10 Pro Plus Launch: ఐకూ శక్తివంతమైన బ్యాటరీతో మరో ఫోన్‌ను విడుదల చేసింది.
iQOO Neo 10 Pro Plus Launch: కళ్లు చెదిరే ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా..?
iQOO Neo 10 Pro Plus Launch: ఐకూ శక్తివంతమైన బ్యాటరీతో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఐకూ నియో 10 సిరీస్ ఈ ఫోన్ 6800ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరాతో సహా అనేక బలమైన ఫీచర్లతో వస్తుంది. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్ ఐకూ నియో 10 ను కంపెనీ వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఐకూ ఈ ఫోన్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అంటే చైనాలో లాంచ్ అయింది. రండి.. ఈ మిడ్-బడ్జెట్ ఐకూ ఫోన్‌లో ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం..?
iQOO Neo 10 Pro+ Price
ఈ ఐకూ ఫోన్ 5 స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది - 12GB RAM + 256GB, 12GB RAM + 512GB, 16GB RAM + 256GB, 16GB RAM + 512GB మరియు 16GB RAM + 1TB. ఈ ఫోన్ ప్రారంభ ధర CNY 2999 అంటే దాదాపు రూ. 35,500. దాని టాప్ వేరియంట్ CNY 4199 కి వస్తుంది. అంటే దాదాపు రూ. 50,000. ఇది బ్లాక్ షాడో, చి గువాంగ్ వైట్, సూపర్ పిక్సెల్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది
iQOO Neo 10 Pro+ Price
12GB RAM + 256GB CNY 2999 రూ. 35,500
12GB RAM + 512GB CNY 3,499 రూ. 41,500
16GB RAM + 256GB CNY 3,299 రూ. 39,000
16GB RAM + 512GB CNY 3,699 రూ. 43,000
16GB RAM + 1TB CNY 4199 రూ. 50,000
iQOO Neo 10 Pro+ Features
ఈ ఐకూ ఫోన్ 6.82-అంగుళాల 2K 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 1440 x 3168 పిక్సెల్స్. ఈ ఫోన్ డిస్‌ప్లే 144Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 4500 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ఐకూ నియో 10 ప్రో ప్లస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు UFS 4.1 స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో 33,11,557 పాయింట్లను సాధించింది. ఈ ఫోన్‌లో గేమింగ్ కోసం Q2 చిప్‌సెట్ ఉంటుంది.
ఈ iQOO ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనికి 50మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ఉంది. ఇది కాకుండా, ఫోన్‌లో 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16MP CMOS సెన్సార్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 7K ఐస్ డోమ్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, ఇది ఫోన్ వేడెక్కకుండా నిరోధిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆరిజిన్ఓఎస్ పై పనిచేస్తుంది. ఇది 120వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో శక్తివంతమైన 6,800mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, ఎన్ఎఫ్‌సి, జిఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బి టైప్-C లకు మద్దతు ఇస్తుంది.