iQOO Neo 10: ఇది కిల్లర్.. ఐకూ నియో 10 వచ్చేస్తోంది.. లీకైన ఫీచర్స్ సూపర్..!

iQOO Neo 10: ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరు నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, వివో సబ్-బ్రాండ్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తూ అనేక ఫీచర్లను వెల్లడించింది.

Update: 2025-05-17 09:41 GMT

iQOO Neo 10: ఇది కిల్లర్.. ఐకూ నియో 10 వచ్చేస్తోంది.. లీకైన ఫీచర్స్ సూపర్..!

iQOO Neo 10: ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరు నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, వివో సబ్-బ్రాండ్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తూ అనేక ఫీచర్లను వెల్లడించింది. ఇప్పుడు ఐకూ ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, కెమెరా, కూలింగ్ సిస్టమ్ గురించి సమాచారాన్ని పంచుకుంది. నివేదికల ప్రకారం.. ఐకూ ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో చైనాలో విడుదల చేసిన ఐకూ Z10 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్.

iQOO Neo 10 Display, Camera Features

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్,144Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పీక్ బ్రైట్నెస్ 5500 నిట్స్ ఉంటుంది. 35 వేల రూపాయల బడ్జెట్‌లో అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే కలిగిన ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ చెబుతోంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఐకూ ఈ ఫోన్‌లో స్క్వేర్ కెమెరా ఐస్‌లాండ్ ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.

దీనితో పాటు, ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అందుబాటులో ఉంటుంది. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే, IQOO నియో 10 లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే దీనికి కూలింగ్ కోసం 7000మి.మీ అల్ట్రా-లార్జ్ వీసీ కూలింగ్ సిస్టమ్ అందించామనీ కంపెనీ తెలిపింది. దీనితో పాటు, బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

iQOO Neo 10 Specifications

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఐకూ ఫోన్ LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని అందించింది. సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ రంగులలో లాంచ్ అవుతుంది. కంపెనీ 2023లో భారతదేశంలో నాన్-ప్రో నియో సిరీస్ ఫోన్ అయిన ఐకూ నియో 7ను విడుదల చేసింది. చివరిసారిగా కంపెనీ భారతదేశంలో ఐకూ నియో 9 ప్రోను రూ.35,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది.

Tags:    

Similar News