iQOO Neo 10 First Sale Offers: రేపు సిద్ధంగా ఉండండి.. ఐకూ నియో 10 ఫస్ట్ సేల్.. ఆఫర్లు అల్లాడించారు..!
iQOO Neo 10 First Sale Offers: ఐకూ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రేపు, జూన్ 3, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు దాని తాజా శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7000mAh బ్యాటరీతో అమ్మకం ప్రారంభమవుతుంది.
iQOO Neo 10 First Sale Offers: రేపు సిద్ధంగా ఉండండి.. ఐకూ నియో 10 ఫస్ట్ సేల్.. ఆఫర్లు అల్లాడించారు..!
iQOO Neo 10 First Sale Offers: ఐకూ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రేపు, జూన్ 3, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు దాని తాజా శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7000mAh బ్యాటరీతో అమ్మకం ప్రారంభమవుతుంది. ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా రూ.27,999 ప్రారంభ ధరకు అమ్మకానికి ఉంటుంది. అలాగే, ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ఆకర్షణీయమైన ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది.
iQOO Neo 10 Offers
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది, ప్రారంభ 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, తరువాత మరొక 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999, మరొక 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999, చివరకు, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999.
ఆసక్తిగల వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి దాదాపు రూ.2000 తగ్గింపును పొందడం ద్వారా కేవలం రూ.27,999 నుండి ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో మధ్యాహ్నం 12:00 గంటల నుండి అమెజాన్ ఇండియా ఐకూ వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుంది.
iQOO Neo 10 Specifications
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల అమోలెడ్, 2800×1260 పిక్సెల్స్, ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఐకూ నియో 10 ఫోటోలు, వీడియోల కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో సోనీ IMX882 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. మరొకటి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్.
సెల్ఫీలు. వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 32MP మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP65 రేటింగ్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ 8జీబీ ర్యామ్ ఆన్‌బోర్డ్ మెమరీని విస్తరించుకునే అవకాశం ఉంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, జీపీఎస్, వైఫై, 3.5మి.మీ ఆడియో జాక్, యూఎస్‌బి టైప్ సి ఛార్జ్ పోర్ట్, ఏజీపీఎస్/జీపీఎస్, గ్లోనాస్, బిడిఎస్, గెలీలియో సెన్సార్లు ఉన్నాయి. చివరగా, ఈ స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.