iQOO Neo 10: లాంచ్ డేట్ తెలిసిందోచ్.. మార్కెట్లోకి ఐకూ నియో 10.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా..?
iQOO Neo 10: ఐకూ తన కొత్త ఫోన్ iQOO Neo 10 ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
iQOO Neo 10: లాంచ్ డేట్ తెలిసిందోచ్.. మార్కెట్లోకి ఐకూ నియో 10.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా..?
iQOO Neo 10: ఐకూ తన కొత్త ఫోన్ iQOO Neo 10 ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మే చివరి వారంలో ఐకూ నియో 10 ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ఎస్ఓసీ, ఇన్-హౌస్ క్యూ1 గేమింగ్ చిప్ ఉంటాయి. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7,000మి.మీ వేపర్ కూలింగ్ చాంబర్‌తో లాంచ్ చేయచ్చు.
iQOO Neo 10 Launch Date
ఐకూ ఇండియా ఒక టీజర్ పోస్ట్‌లో నియో 10 మే 26న భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ఎప్ఓసీ, ఇన్-హౌస్ Q1 గేమింగ్ చిప్‌సెట్ ఉంటాయి. ఈ ఫోన్ ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్స్‌లో లభిస్తుందని కంపెనీ ఇంతకుముందు ఒక పోస్ట్‌లో వెల్లడించింది.
iQOO Neo 10 Specifications
ఐకూ నియో 10 కోసం అమెజాన్ మైక్రోసైట్ 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని నిర్ధారిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 8.09మి.మీ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఈ విభాగంలో అత్యంత సన్నని 7,000mAh మోడల్‌గా చెబుతున్నారు. ఇది బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది, థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7,000మి.మీ కూలింగ్ ఛాంబర్ అందించారు.
ఈ విభాగంలో 144fps గేమింగ్‌కు సపోర్ట్ ఇచ్చే ఏకైక ఫోన్ iQOO నియో 10 అని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ ధర ఇంకా తెలియలేదు. రాబోయే స్మార్ట్‌ఫోన్ LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది.నియో 10 లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని, "స్క్విర్కిల్" ఆకారపు మాడ్యూల్ లోపల రింగ్ లాంటి LED ఫ్లాష్ ఉంటుందని టీజర్ వెల్లడించింది.