iPhone SE 4: ఐఫోన్ SE 4 లాంచ్ డేట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా..?

iPhone SE 4: టెక్ దిగ్గజం యాపిల్ మోస్ట్ ఆఫర్డబుల్ సిరీస్‌ ఎస్ఈ (SE). ఈ సిరీస్‌లో వస్తున్న ఫోర్త్ జనరేషన్ ఫోన్ iPhone SE 4 కోసం మొబైల్ లవర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

Update: 2025-02-12 14:08 GMT

iPhone SE 4: టెక్ దిగ్గజం యాపిల్ మోస్ట్ ఆఫర్డబుల్ సిరీస్‌ ఎస్ఈ (SE). ఈ సిరీస్‌లో వస్తున్న ఫోర్త్ జనరేషన్ ఫోన్ iPhone SE 4 కోసం మొబైల్ లవర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. రెండెళ్ల తర్వాత కంపెనీ ఈ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఇందుకోసం ఎటువంటి ఈవెంట్‌ను నిర్వహించడం లేదు, ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

చాలా ఏళ్ల తర్వాత SE సిరీస్ ఫోన్‌ల డిజైన్‌ను యాపిల్ మార్చబోతోంది. ఇప్పుడు SE 4.. ఐఫోన్ 14, ఐఫోన్ 16 మాదిరిగానే కనిపించే అవకాశం ఉంది. ఫోన్ ఫుల్ స్క్రీన్ డిజైన్‌తో వస్తుంది. అంతేకాకుండా ఇందులో టచ్ ఐడికి బదులుగా ఫేస్ ఐడి ఫీచర్‌ ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత హోమ్ బటన్ ఫీచర్‌కు కంపెనీ గుడ్‌బై చెప్పనుంది.

ఐఫోన్ SE 4లో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ A18 చిప్‌సెట్‌ను ఇందులో చూడచ్చు. 8జీబీ ర్యామ్+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంది. అలానే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నారు. యూఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.

భారత్‌లో ఐఫోన్ SE 4 ధర రూ.49,900 నుండి ప్రారంభం కావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. మొబైల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే ఈ సమాచారం అందుబాటులోకి రానుంది. విక్రయాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News