iPhone Dispute: చైనా బో డిస్‌ప్లేలు, అమెరికాలో నిషేధం గందరగోళం - యాపిల్ క్లారిటీ
చైనా BOE డిస్‌ప్లేలు వాడిన ఐఫోన్లపై అమెరికాలో నిషేధం అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై యాపిల్ స్పందన ఏమిటి? నిషేధం నిజమేనా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
iPhone Dispute: Confusion Over US Ban on China’s BOE Displays – Apple Issues Clarification
ఐఫోన్‌లో చైనా కంపెనీ BOE (Beijing Oriental Electronics) తయారు చేసిన OLED డిస్‌ప్లేలు వాడుతున్న కారణంగా అమెరికాలో ఐఫోన్లపై నిషేధం ఉంటుందని ఇటీవల కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. US International Trade Commission (ITC) ఇచ్చిన ప్రాథమిక తీర్పు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
BOEపై శామ్‌సంగ్ ఆరోపణలు
2021 నుంచి BOE కంపెనీ ఐఫోన్లకు OLED ప్యానెల్స్ సరఫరా చేస్తోంది. అయితే, BOE తమ టెక్నాలజీని అక్రమంగా వాడుతోందని Samsung ITC వద్ద ఫిర్యాదు చేసింది. శామ్‌సంగ్ యొక్క వాణిజ్య రహస్యాలను చైన్నా కంపెనీ దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ITC కూడా శామ్‌సంగ్ వాదనకు మద్దతుగా తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో, BOE మరియు అనుబంధ సంస్థలు తయారుచేసిన OLED డిస్‌ప్లేలను అమెరికాలో విక్రయించరాదు, ఇప్పటికే ఉన్న స్టాక్‌ను కూడా అమ్మకూడదని స్పష్టంగా తెలిపింది.
యాపిల్ స్పందన
ఈ వివాదంపై యాపిల్ అధికారికంగా స్పందించింది. “ఈ కేసులో యాపిల్ పార్టనర్ కాదు. ఈ తీర్పు మా ఉత్పత్తులపై ఎలాంటి ప్రభావం చూపదు,” అని 9to5Mac కు వెల్లడించింది.
ప్రస్తుతం యాపిల్ iPhone 15, iPhone 16, అలాగే రాబోయే iPhone 17లో కూడా BOE, LG, Samsung డిస్‌ప్లేలను వాడుతోంది. అయితే, BOE ప్యానెల్స్ ముఖ్యంగా చైనా మార్కెట్ కోసం మాత్రమే వాడుతున్నట్టు తెలుస్తోంది. అవి అంతర్జాతీయ మార్కెట్లో వాడే డిస్‌ప్లే నాణ్యతకు సరిపోలవని సమాచారం.
ముందు ఏమౌతుంది?
ప్రస్తుతం ITC ఇచ్చింది ప్రాథమిక తీర్పు మాత్రమే. చివరి నిర్ణయం ఈ ఏడాది చివర్లో రావొచ్చు. ఆ తర్వాత 60 రోజుల్లోగా అమెరికా అధ్యక్షుడు ఆ తీర్పును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.