iPhone 16e First Sale: రెడీగా ఉండండి.. ఐఫోన్ 16e ఫస్ట్ సేల్.. ఈ బ్యాంక్ కార్డ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు..!
iPhone 16e First Sale: యాపిల్ మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 16eని విడుదల చేసింది.
iPhone 16e First Sale: యాపిల్ మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 16eని విడుదల చేసింది. ఐఫోన్ 16 సిరీస్‌లో ఈ ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో కొత్త ఐఫోన్ 16e సందడి చేస్తోంది. కంపెనీ 16eని సరసమైన ఐఫోన్‌గా పరిచయం చేసింది. ఐఫోన్16e ఫిబ్రవరి 28 నుండి సేల్‌కి వస్తుంది. మీరు కూడా ఈ చౌకైన యాపిల్ ఫోన్‌ను తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు. మొదటి సేల్‌లో రూ.7 వేల డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఐఫోన్ రూ.52,990కి మీ సొంతం చేసుకోవచ్చు. రండి, ఈ కొత్త ఐఫోన్ 16e ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
iPhone 16e Offers
కంపెనీ ఐఫోన్ 16e ఫోన్‌ను రూ.59,990 ప్రారంభ ధరతో పరిచయం చేసింది. కొత్త ఐఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. మొదటి సేల్‌లో ఈ ఐఫోన్ పై కంపెనీ రూ.4,000 తగ్గింపును అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఐఫోన్ 16e కొంటే 4,000 ఫ్లాట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మరోవైపు, కొత్త ఐఫోన్ 16e కొనేటప్పుడు పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే దాని పైన రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. డిస్కౌంట్ అనేది ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మొబైల్ కొనుగోలు చేస్తే కంపెనీ రూ.4,000 తగ్గింపును కూడా అందిస్తుంది.
iPhone 16e Specifications
ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్,1200 నిట్స్ HDR బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలానే డిస్‌ప్లే 460ppi కి సపోర్ట్ ఇస్తుంది. మొబైల్‌లో శక్తివంతమైన Apple A18 ప్రాసెసర్ ఉంది. ఇదే ప్రాసెసర్ ఐఫోన్ 16లో కూడా అందుబాటులో ఉంది. ప్రాసెసర్ మృదువైన, వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు చాలా బాగుంటుంది.
ఐఫోన్ 16e ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ప్రత్యేకంగా, ఈ లెన్స్ యాపిల్ ఇమేజింగ్ టెక్నాలజీని అందిస్తాయి. ఇందులో 2x టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఐఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఐఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, ఈ బ్యాటరీ 26 గంటల వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో వైర్‌లెస్ Qi ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆపిల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుంది.