iPhone Offers: ఆపిల్ లవర్స్‌కు ఎగిరిగంతేసే న్యూస్.. ఐఫోన్ 15 ప్లస్‌పై రూ.18 వేల డిస్కౌంట్..!
iPhone Offers: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ లవర్స్‌కు ఎగిరిగంతేసే న్యూస్ వెల్లడించింది.
iPhone Offers: ఆపిల్ లవర్స్‌కు ఎగిరిగంతేసే న్యూస్.. ఐఫోన్ 15 ప్లస్‌పై రూ.18 వేల డిస్కౌంట్..!
iPhone Offers: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ లవర్స్‌కు ఎగిరిగంతేసే న్యూస్ వెల్లడించింది. ఐఫోన్ 15సిరీస్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనాలనుకుంటే ఇటువంటి ఆఫర్ మళ్లీ రాకపోవచ్చు. ఐఫోన్ 15 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో రూ. 18,000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఆపిల్ ఈ ఐఫోన్‌ను 2023లో విడుదల చేసింది. ఈ ఫోన్ A16 బయోనిక్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మొబైల్ డిస్‌ప్లే 6.1 అంగుళాలు. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఆఫర్‌లు, ఇతర ఫీచర్ల చూద్దాం.
iPhone 15 Plus Offers
ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.79,900కి విడుదల చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్‌బీసీ బ్యాంక్, కెనరా బ్యాంక్‌తో సహా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై అదనపు తగ్గింపులు ఉన్నాయి. ఈ కార్డులపై ఐఫోన్ 15 ప్లస్ కొంటే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఈఎమ్ఐ ఆఫర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో అదనంగా రూ. 5,500 తగ్గింపు ఇస్తున్నారు. అలాగే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇంకా ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఐఫోన్ 15 ప్లస్‌ను చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. ఐఫోన్ 15 ప్లస్ గ్రీన్, పింక్, ఎల్లో, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఉంది.
iPhone 15 Plus Features
ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 48-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ (అల్ట్రావైడ్) కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు , వీడియో కాలింగ్ కోసం.. ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ మొబైల్‌లో 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఫోన్ 4383mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ అయింది. కనెక్టివిటీ పరంగా.. 5G, 4G VOLTE, 4G, 3G, 2G, బ్లూటూత్ v5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి.