Infinix Note 50s 5G Plus Launched: ఇన్ఫినిక్స్ మాస్టర్ ప్లాన్.. AI ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్ ఆఫర్లు చూస్తే వదల్లేరు...!
Infinix Note 50s 5G Plus Launched: ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారతదేశంలో తన కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ను అధికారికంగా విడుదల చేసింది.
Infinix Note 50s 5G Plus Launched: ఇన్ఫినిక్స్ మాస్టర్ ప్లాన్.. AI ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్ ఆఫర్లు చూస్తే వదల్లేరు...!
Infinix Note 50s 5G Plus Launched: ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారతదేశంలో తన కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్, 64MP సోనీ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరాతో 5500mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Infinix Note 50s 5G+ Launch Date
దేశంలో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.15,999 కాగా, దాని మరో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. ఈ స్మార్ట్‌ఫోన్ 2025 ఏప్రిల్ 24 నుండి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి రానుంది.
Infinix Note 50s 5G+ Offers
దీనితో పాటు, ఆసక్తి ఉన్న వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డును ఉపయోగించి రూ. 1000 తగ్గింపును కూడా పొందచ్చు. ఈ విధంగా, మీరు దీన్ని కేవలం రూ. 14,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. మెరైన్ బ్లూ, రూబీ రెడ్, టైటానియం గ్రే.
Infinix Note 50s 5G+ Specifications
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీబీ వరకు ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15 తో వస్తుంది. ఇది గేమింగ్ చేస్తున్నప్పుడు 90fps ఫ్రేమ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్‌లో 64MP మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ రియర్ కెమెరా ఉంది, ఇది 30fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. దీని ముందు కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది డ్యూయల్ వీడియో క్యాప్చర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోలాక్స్ AI అసిస్టెంట్, AI వాల్‌పేపర్ జనరేటర్, AIGC మోడ్ , AI ఎరేజర్ వంటి ప్రత్యేక AI ఫీచర్లు ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డు ఆల్-రౌండ్ ఫాస్ట్‌చార్జ్ 3.0 కి సపోర్ట్ ఇస్తుంది. ఇది 60 నిమిషాల్లో ఫోన్‌ను ఒకటి నుండి 100శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో వచ్చేసింది. భద్రత కోసం హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.