Infinix Solar Power and Color Changing Phone: టెక్నాలజీ అదిరింది.. ఎండతో ఛార్జ్ అయ్యే ఫోన్ వచ్చేసింది..!
Infinix Solar Power and Color Changing Phone: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో Infinix అందరిని ఆశ్చర్యపరుస్తూ రెండు కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఇందులో ఒకటి సౌరశక్తితో ఛార్జయ్యేది, మరొకటి 'ఊసరవెల్లి'లా రంగు మార్చే ఫోనన్.
Infinix Solar Power and Color Changing Phone: టెక్నాలజీ అదిరింది.. ఎండతో ఛార్జ్ అయ్యే ఫోన్ వచ్చేసింది..!
Infinix Solar Power and Color Changing Phone: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో Infinix అందరిని ఆశ్చర్యపరుస్తూ రెండు కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఇందులో ఒకటి సౌరశక్తితో ఛార్జయ్యేది, మరొకటి 'ఊసరవెల్లి'లా రంగు మార్చే ఫోనన్. ఈ ఫోన్లు ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, మొబైల్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల వైపు బ్రాండ్ కదలికను ఇది చూపిస్తుంది. ఈ రెండు ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Solar Power Smartphone
ఇన్ఫినిక్స్ సౌరశక్తితో పనిచేసే ఫోన్‌కు వెనుక భాగంలో సోలార్ ప్యానెల్ అమర్చారు. దీనికి కంపెనీ సోలార్ ఎనర్జీ-రిజర్వింగ్ టెక్నాలజీ అని పేరు పెట్టింది. ఇది సాధారణ సిలికాన్ ఆధారిత సోలార్ ప్యానెల్‌ల కంటే సన్నగా, మరింత సులభంగా ఉత్పత్తి చేసే పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్‌లను ఉపయోగిస్తుంది.
అంతే కాకుండా గరిష్ట పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటే MPPT సిస్టమ్ ఈ ఫోన్‌లో ఉపయోగించారు. ఇది శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ప్రత్యక్ష సూర్యకాంతిలో వేడెక్కకుండా కూడా రక్షిస్తుంది. ప్రస్తుతం, ఈ సౌర వ్యవస్థ 2W వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి బదులుగా బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి రూపొందించారు.
Solar Power Mobile Case
ఇన్ఫినిక్స్ సౌరశక్తితో నడిచే కేస్ ఫోన్ కంటే మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ రిమూవ్‌బుల్ కేస్‌లో ఇంటర్నల్ సోలార్ ప్యానెల్‌లు ఉన్నాయి, ఇది సైడ్ కాంటాక్ట్ సిస్టమ్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. ప్రత్యేక ఛార్జింగ్ పోర్ట్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది.
Color Changing Smartphone
సౌరశక్తితో పనిచేసే ఫోన్‌లతో పాటు ఇన్ఫినిక్స్ కలర్ మారే E Ink ఫోన్ 2వ జెన్ మోడల్‌ను కూడా పరిచయం చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈసారి ఛార్జింగ్ సమయంలో మాత్రమే కలర్ మారుతుంది, అయితే కొత్త మోడల్ ఫోన్ బ్యాటరీ నుండి శక్తిని తీసుకుంటుంది.