కొత్త ఫోన్ కొన్నారా? రూపాయి ఖర్చులేకుండా పాత ఫోన్ CCTVలా మార్చండి

Smartphone Into CCTV Camera: పాత స్మార్ట్ ఫోన్ ను ఇంటి సెక్యూరిటీ కెమెరాలా వాడొచ్చు

Update: 2021-05-26 09:49 GMT

సీసీటీవీ (ఫైల్ ఇమేజ్)

Smartphone Into CCTV Camera: స‌రి కొత్త టెక్నాల‌జీతో మార్కెట్లోకి వ‌చ్చే వ‌స్తులపై మ‌నం ఎంతో మోజు ప‌డ‌తాం. వాటిని కొనే వ‌ర‌కు మ‌న‌సు కుద‌ట‌ప‌డ‌దు. ఇక స్మార్ట్ ఫోన్స్ ఐతే మరీను.. పాత మొబైల్ ప‌క్క‌న ప‌డేసి కొత్త ఫోన్ తీసుకుంటాం. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో వస్తూవున్నాయి. అయితే, మ‌నం వాడిన‌ పాత మొబైల్ సంగతేంటి? మరి ఈ పాత ఫోన్లను ఎలా ఉప‌యోగించాలి. దానిని ఇంటి సెక్కురిటీ కెమెరాలా వాడొచ్చు. దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు, డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. పాత ఫోన్ ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం?

మీ ఇంట్లో పాత ఫోన్లను ఒక సెక్యూరిటీ కెమేరాగా ఉపయోగించవచ్చు. ఆవి మీ ఇంటిని రక్షించడంలో ఉపయోగించుకోవచ్చు. బేబీ మానిటర్‌ గా ఉపయోగించవచ్చు. దాని కోసం ముందుగా...మీ పాత మొబైల్ ఫోనులో ఈ సెక్యూరిటీ కెమెరా యాప్ ని ప్లే ఇన్స్టాల్ చేయండి. ఇలాంటి సౌకర్యంతో చాలా యాప్స్ Google store లో లభిస్తాయి.

మీరు వీటితో లోకల్ స్ట్రీమింగ్, క్లౌడ్ స్ట్రీమింగ్, రికార్డింగ్‌ను పొందినట్లే, ఫుటేజీని రిమోట్‌గా.. లోకల్ స్టోరేజి చేసే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఇది కాకుండా మోషన్ డిటెక్షన్, హెచ్చరికలను కూడా పొందేవీలుంది. సెటప్ చేసిన తర్వాత, మీరు మీ ఇంటిలో లేదా ఎక్కడి నుండైనా భద్రతా కెమెరాను నియంత్రించవచ్చు. క్రొత్త ఫోన్ ద్వారా మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరా చేసుకోవడానికి Alfred యాప్ ఉపయోగించడం ఉత్తమ మార్గం. ఇది క్రాస్ ప్లాట్‌ఫాం, అంటే మీ పాత ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఇది iOS ఆధారిత ఆపిల్ ఐఫోన్ అన్నది పట్టింపు లేదు.

మీ క్రొత్త ఫోన్‌తో Alfred ఉచితం, ప్రత్యక్ష ఫీడ్ యొక్క రిమోట్ వ్యూ ను అందిస్తుంది. మీరు హెచ్చరికలను కూడా పొందుతారు. ఉచిత క్లౌడ్ స్టోరేజి లభిస్తుంది. దీనితో పాటు, మీకు టూ-వే ఆడియో ఫీడ్ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఇది ముందు, వెనుక కెమెరా ద్వారా మీకు సమాచారం ఇస్తుంది.

ఎం చేయాలి

మీరు Android లేదా iOS స్టోర్ కి వెళ్లి Alfred యాప్ ని మీ క్రొత్త మరియు పాత ఫోన్‌లలో డౌన్లోడ్ చేయాలి. పాత టాబ్లెట్‌తో కూడా చేయవచ్చు.

*మీ రెండు ఫోన్‌లలోనూ ఈ యాప్ ని డౌన్‌లోడ్ చేయండి.

*స్టార్ట్ బటన్‌ను వ‌స్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

* వ్యూయర్ ని ఎంచుకుని ముందుకు సాగండి.

* సైన్ ఇన్ చేయమని అడుగుతుంది.

*మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయవచ్చు.

*మీరు మీ పాత ఫోన్‌లో కూడా ఇలాంటిదే చేయాల్సి ఉంటుంది,

*రెండు ఫోన్‌లలో ఒకే ఖాతాకు సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకోవాలి.

*మీ ఫోన్‌ను మీ ఇంట్లో సరైన స్థలంలో ఉంచాలి

*ఆ తర్వాత  మీ పాత  ఫోన్‌ ఒక సెక్యూరిటీ కెమేరాగా మీకు లైవ్ ఫీడ్ అందిస్తుంది.

Tags:    

Similar News