Honor X7d 5G Launched: హానర్‌ కొత్త ఫోన్‌.. తక్కువ ధరలోనే అదిరే ఫీచర్స్.. లాంచ్ ఎప్పుడంటే..?

హానర్ X7d 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ దాని 5G వెర్షన్ హానర్ X7d 5Gని కూడా ఆవిష్కరించింది. ఈ ఫోన్ 6500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Update: 2025-09-01 10:30 GMT

Honor X7d 5G Launched: హానర్‌ కొత్త ఫోన్‌.. తక్కువ ధరలోనే అదిరే ఫీచర్స్.. లాంచ్ ఎప్పుడంటే..?

Honor X7d 5G Launched: హానర్ X7d 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ దాని 5G వెర్షన్ హానర్ X7d 5Gని కూడా ఆవిష్కరించింది. ఈ ఫోన్ 6500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి 50-మెగాపిక్సెల్ మెయిన్ వెనుక కెమెరా ఉంది. కంపెనీ ప్రస్తుతం దీనిని మలేషియాలో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఒకే స్టోరేజ్ వేరియంట్, రెండు వేర్వేరు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేశారు. ఫోన్ IP65 రేటింగ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Honor X7d 5G Specifications

ది టెక్ ఔట్ లుక్ నివేదిక ప్రకారం.. హానర్ X7d 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ 2.3 GHz క్లాక్డ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌ ఉంది. అడ్రినో 619 జీపీయూ ఇంటిగ్రేటెడ్‌ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడితే ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంటుంది, దాని పైన బ్రాండ్ సొంత మ్యాజిక్ OS 9.0 కస్టమ్ స్కిన్ ఉంది. చెప్పినట్లుగా, కంపెనీ ఈ ఫోన్‌ను ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరోజ్.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల టిఎఫ్‌టి ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 1610x720 పిక్సెల్ రిజల్యూషన్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే డిస్‌ప్లే డైనమిక్ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది, దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

ఫోన్ 6500ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 35W హానర్ సూపర్‌ఛార్జ్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో కనిపించే ఇతర ఫీచర్స్‌లో 2G/3G/4G/5G నెట్‌వర్క్, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, 2.4 GHz + 5 GHz డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్‌తో WiFi 5, NFC, OTG, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌స్టంట్ AI బటన్, 400శాతం వాల్యూమ్‌తో డ్యూయల్ స్పీకర్లు, హానర్ సౌండ్ 7.3, 5-స్టార్ SGS ప్రీమియం డ్రాప్ రెసిస్టెన్స్, IP65-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్, 8.24 మి.మీ మందం, 206 గ్రాముల బరువు ఉన్నాయి. ఈ ఫోన్‌ను కంపెనీ రెండు కలర్స్‌లో విడుదల చేసింది - వెల్వెట్ బ్లాక్, డెసర్ట్ గోల్డ్.

Honor X7d 5G Price

కంపెనీ ఈ ఫోన్‌ను వెల్వెట్ బ్లాక్, డెసర్ట్ గోల్డ్ అనే రెండు కలర్స్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఫోన్ ధర, లభ్యత గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బహుశా బ్రాండ్ త్వరలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News