Honor 400 Series: హానర్ కొత్త ఫోన్.. కెమెరా ఫీచర్లు కేక.. లాంచ్ డేట్ వచ్చేసింది..!

Honor 400 Series: హానర్ త్వరలో భారతదేశంలో 4 కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా చైనీస్ బ్రాండ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ లాంచ్ తేదీని నిర్ధారించింది.

Update: 2025-05-20 13:30 GMT

Honor 400 Series: హానర్ కొత్త ఫోన్.. కెమెరా ఫీచర్లు కేక.. లాంచ్ డేట్ వచ్చేసింది..!

Honor 400 Series: హానర్ త్వరలో భారతదేశంలో 4 కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా చైనీస్ బ్రాండ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ లాంచ్ తేదీని నిర్ధారించింది. ఈ ఫోన్ ఐఫోన్ 16 లాగా డ్యూయల్ వర్టికల్ కెమెరా డిజైన్‌తో వస్తుంది. ఈ హానర్ ఫోన్ హానర్ 400 సిరీస్ కింద పరిచయం చేయనున్నారు. అదనంగా, కంపెనీ తన మ్యాజిక్ V ఫ్లిప్ 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్,హానర్ మ్యాజిక్ V5 లను కూడా విడుదల చేయబోతోంది.

Honor 400 Series Launch Date

హానర్ 400 సిరీస్ మే 28న చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ లీ కున్ దాని లాంచ్ తేదీని వెల్లడించారు. అలాగే, ఈ సిరీస్ ప్రారంభోత్సవం సందర్భంగా, మ్యాజిక్ సిరీస్ రాబోయే ఫోల్డబుల్, ఫ్లాగ్‌షిప్ సిరీస్ టీజర్‌ను షేర్ చేసింది. హానర్ తదుపరి ఫోల్డబుల్ ఫోన్ 2025 ప్రథమార్థంలో విడుదల అవుతుంది. దీని అర్థం కంపెనీ జూన్ నాటికి దీనిని లాంచ్ చేయచ్చు.

Honor 400 Series Features

హానర్ 400 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు ప్రో మోడల్ కూడా ఉంటుంది. దీని ప్రో మోడల్‌ను 7,200mAh బ్యాటరీతో అందించవచ్చు. స్టాండర్డ్ మోడల్‌లో 5,300mAh బ్యాటరీతో వస్తుంది. ఈ సిరీస్ గత సంవత్సరం ప్రారంభించిన హానర్ 300 సిరీస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే, ఈ సిరీస్ గ్లోబల్ వేరియంట్ చైనీస్ మోడల్ కంటే చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. హానర్ 400 ప్రో గ్లోబల్ వేరియంట్‌లో 6,000mAh బ్యాటరీ, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 100W వైర్డు ఉండవచ్చు.

ప్రో మోడల్ లూనార్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, టైడల్ బ్లూ కలర్స్‌లో లాంచ్ అవుతుంది. ప్రో మోడల్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వచ్చు, దీనిలో 200MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనికి IP68, IP69 రేటింగ్‌లు ఉంటాయి,

హానర్ 400 ను డెజర్ట్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్, మెటియోర్ సిల్వర్ కలర్స్‌లో లాంచ్ చేయవచ్చు. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానుంది. దీనికి 200MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనితో పాటు, 12MP అల్ట్రా వైడ్, 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 తో ​​వస్తుంది. ఈ సిరీస్‌లోని రెండు ఫోన్‌లు ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవుతుంది.

Tags:    

Similar News