Honor 400 Series: 200 AI కెమెరా.. హానర్ కొత్త ఫోన్ కేక.. కెమెరా ఫీచర్లు హైలెట్.. మే 22న లాంచ్..!
Honor 400 Series: హానర్ ప్రపంచ మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మే 22న హానర్ 400 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
Honor 400 Series: 200 AI కెమెరా.. హానర్ కొత్త ఫోన్ కేక.. కెమెరా ఫీచర్లు హైలెట్.. మే 22న లాంచ్..!
Honor 400 Series: హానర్ ప్రపంచ మార్కెట్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మే 22న హానర్ 400 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్‌లో హానర్ 400, హానర్ 400 ప్రో మోడల్‌లు ఉంటాయి. కంపెనీ ఇటీవల ఫోన్ కొత్త టీజర్ వీడియోను విడుదల చేసింది. ఇది దాని కెమెరా వివరాలతో సహా ఫోన్ మొత్తం స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడిస్తుంది. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ దాని అద్భుతమైన 200Mp AI కెమెరా, ఫోటోగ్రఫీ పరంగా ఉత్తమ బ్రాండ్‌లతో పోటీ పడుతుంది. ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Honor 400 Specifications
లీకైన వివరాల ప్రకారం.. హానర్ 400 ఫోన్ 6.55-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. హానర్ 400 లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 200MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,300mAh బ్యాటరీని పొందే అవకాశం ఉంది.
Honor 400 Pro Specifications
హానర్ 400 ప్రో మోడల్‌లో పెద్ద 6.7-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు. అలానే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. OISతో 200MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్,12MP అల్ట్రావైడ్ ఉంటాయి. డెప్త్ సెన్సార్‌తో 50MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది. అలానే IP68/IP69 ప్రొటక్షన్, 5,300mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
Honor 400 Pro Series Price
హానర్ మే 22న ప్రపంచవ్యాప్తంగా €499 (సుమారు రూ. 47,943) కు హానర్ 400 ను విడుదల చేయవచ్చు. హానర్ 400 ప్రో ధర దాదాపు €799 (సుమారు రూ. 76,767) ఉంటుందని అంచనా.