Fan Speed Increase Tips: మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా.. ఈ ఒక్క పనిచేస్తే మళ్లీ వేగం పుంజుకుంటుంది..!

Fan Speed Increase Tips: ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల అందరూ ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చుంటారు.

Update: 2024-05-10 10:51 GMT

Fan Speed Increase Tips: మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా.. ఈ ఒక్క పనిచేస్తే మళ్లీ వేగం పుంజుకుంటుంది..!

Fan Speed Increase Tips: ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల అందరూ ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చుంటారు. దీనివల్ల ఉక్కపోత నుంచి కొంచెం ఉపశమనం పొందుతారు. అయితే చాలామందికి కూలర్లు,ఏసీలు కొనే స్థోమత ఉండదు. దీంతో ఫ్యాన్లపైనే ఎక్కువగా ఆధారపడుతారు. ఇలాంటి వారికి తరచుగా ఒక సమస్య ఎదురవుతుంది. అదేంటంటే ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిపోవడం. దీంతో చాలామంది కొత్త ఫ్యాన్‌ కొనాలని ఆలోచిస్తుంటారు. కానీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిపోవడానికి గల కారణాల గురించి అన్వేషించరు. ఈ రోజు తగిన ఫ్యాన్ స్పీడ్‌ను ఏ విధంగా పెంచాలో తెలుసుకుందాం.

వేసవిలో ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఇందులో మొదటిది తక్కువ వోల్టేజీ కారణంగా ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గుతుంది. వేసవిలో అధిక విద్యుత్ వినియోగం వల్ల వోల్టేజీ తగ్గుతుంది. దీని కారణంగా తరుచుగా ఇండ్లలో ఫ్యాన్ వేగం తగ్గుతుంటుంది. రెండో కారణం ఫ్యాన్ కండెన్సర్ పాడవడం. మీ ఫ్యాన్ వేగం తక్కువగా ఉండి వోల్టేజ్ సరిగ్గా ఉంటే మీ ఫ్యాన్ కండెన్సర్ వీక్‌గా ఉందని అర్థం చేసుకోండి. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ కండెన్సర్‌ని మార్చుకోవడం చేయాలి.

ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి ఫ్యాన్ కండెన్సర్‌ని మార్చాలి. దీనికి మెకానిక్ అవసరం లేదు. కండెన్సర్‌ను మీరే వేసుకోవచ్చు. పాత కండెన్సర్‌ను చూపించి ఎలక్ట్రిక్‌ షాప్‌లో కొత్త కండెన్సర్‌ ను కొనుగోలు చేయాలి. ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్‌లో కండెన్సర్‌ను అమర్చ వచ్చు. తర్వాత మీ ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతుంది. ఇందుకోసం కొత్త ఫ్యాన్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం తప్పుతుంది.

Tags:    

Similar News