Internet Speed Tips: ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిందా.. ఈ చిట్కాలు పాటిస్తే బ్రౌజింగ్‌, డౌన్‌లోడ్‌ స్పీడప్ అవుతాయి..!

Internet Speed Tips: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది.

Update: 2024-04-05 15:30 GMT

Internet Speed Tips: ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిందా.. ఈ చిట్కాలు పాటిస్తే బ్రౌజింగ్‌, డౌన్‌లోడ్‌ స్పీడప్ అవుతాయి..!

Internet Speed Tips: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. చాలా రకాల పనుల నుంచి సినిమాలు, గేమ్స్‌ ఆడడం వరకు ఇంటర్నెట్‌ అవసరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం సడెన్‌గా తగ్గిపోతుంది. దీని కారణం గా బ్రౌజింగ్, డౌన్‌లోడ్ సరిగా జరగదు. చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కంప్యూటర్‌ను రూటర్‌కు దగ్గరగా పెట్టండి

మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ రూటర్‌కి ఎంత దగ్గరగా ఉంటే అంత వేగంగా ఇంటర్నెట్ రన్ అవుతుంది. రూటర్ దూరంగా ఉంటే వేగం తగ్గుతుంది. రూటర్ మీ పరికరానికి మధ్య ఎటువంటి గోడ ఉండకూడదు. దీనివల్ల ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుంది. మీరు రూటర్ దగ్గర కూర్చున్నా ఇంటర్నెట్‌ వేగం తక్కువగా ఉంటే కొత్త రూటర్‌ని కొనుగోలు చేయాలని అర్థం.

బ్రౌజర్ హిస్టరీని తొలగించండి

బ్రౌజర్‌లో స్టోర్‌ అయిన హిస్టరీ కారణంగా కొన్నిసార్లు వెబ్‌సైట్‌లు నెమ్మదిగా రన్ అవుతాయి. ఈ పనికిరాని ఫైల్‌లను శుభ్రం చేయడానికి మీరు బ్రౌజర్ కాష్, హిస్టరీని తొలగించాలి. ఇది ఇంటర్నెట్ స్పీడ్‌ని పెంచడంలో సాయపడుతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌లను క్లోజ్‌ చేయండి

కొన్నిసార్లు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో పనికిరాని యాప్‌లు ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తాయి. ఈ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ స్పీడ్‌ను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి యాప్‌లను గుర్తించి వెంటనే క్లోజ్‌ చేయాలి.

రూటర్ ఆఫ్ చేసి ఆన్‌ చేయండి

రూటర్‌ సెట్టింగ్‌లు అవాంతరాల కారణంగా కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఈ పరిస్థితిలో మోడెమ్ లేదా రూటర్ ఆఫ్‌ చేసి మళ్లీ ఆన్‌ చేయాలి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News