Google: ఆన్‌లైన్ మోసాలకు చెక్.. యూజర్ల భద్రతే లక్ష్యంగా 'గూగుల్ సేఫ్టీ ఛార్టర్' ప్రారంభం

Google: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఫిషింగ్ వెబ్‌సైట్‌లు, నకిలీ యాప్‌లు,ఫ్రాడ్ కాల్స్ బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు గూగుల్ ఒక పెద్ద అడుగు వేసింది.

Update: 2025-06-19 04:30 GMT

Google: ఆన్‌లైన్ మోసాలకు చెక్.. యూజర్ల భద్రతే లక్ష్యంగా 'గూగుల్ సేఫ్టీ ఛార్టర్' ప్రారంభం

Google: ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఫిషింగ్ వెబ్‌సైట్‌లు, నకిలీ యాప్‌లు,ఫ్రాడ్ కాల్స్ బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు గూగుల్ ఒక పెద్ద అడుగు వేసింది. గూగుల్ భారతదేశంలో కొత్త సేఫ్టీ ఛార్టర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లకు ఇంటర్‌నెట్‌లో మరింత సురక్షితమైన అనుభవం లభిస్తుంది. గూగుల్ ఈ కొత్త సేఫ్టీ ప్లా ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది వివరంగా తెలుసుకుందాం.

గూగుల్ సేఫ్టీ ఛార్టర్ అంటే ఏమిటి?

గూగుల్ సేఫ్టీ ఛార్టర్ నిజానికి ఒక రకమైన సైబర్ సేఫ్టీ గైడ్‌లైన్. దీనిని ముఖ్యంగా భారతదేశం వంటి దేశం కోసం రూపొందించారు. ఇంటర్‌నెట్‌ను యూజర్లకు సురక్షితంగా మార్చడం, నకిలీ సైట్‌లు, యాప్‌లు, స్కామ్‌ల నుండి రక్షించడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మీద నమ్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. గూగుల్ ఈ ఛార్టర్ ద్వారా భారతదేశంలోని టెక్ కంపెనీలు, యాప్ డెవలపర్‌లను కూడా భాగం చేస్తోంది. తద్వారా వారు కూడా తమ ప్లాట్‌ఫామ్‌లలో సేఫ్టీ ఫీచర్లను ప్రారంభించగలరు.

గూగుల్ సేఫ్టీ ఛార్టర్ ఎలా పనిచేస్తుంది?

యూజర్ డేటా భద్రత, పారదర్శకత, క్లియర్ పర్మీషన్ పాలసీలను అనుసరించే యాప్‌లు, వెబ్‌సైట్‌లకు గూగుల్ ప్రాధాన్యత ఇస్తుంది.ప్లే స్టోర్‌లో ఇప్పుడు నకిలీ యాప్‌లు, ఆర్థిక మోసాలకు పాల్పడే యాప్‌లు, డూప్లికేట్ అప్లికేషన్‌లను ముందుగానే నిరోధించగల సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ యూజర్లకు సురక్షితమైన ఇంటర్‌నెట్‌ను ఎలా ఉపయోగించాలి, ఎవరిని నమ్మాలి, ఏ లింక్‌లు లేదా యాప్‌లకు దూరంగా ఉండాలి వంటి విషయాలపై అవగాహన కల్పిస్తుంది.

భారతదేశంలో ఈ చర్య ఎందుకు అవసరం?

భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడం వేగంగా పెరిగింది. అయితే, దీనితో పాటు స్కామ్‌ల కేసులు కూడా పెరిగాయి. ఇందులో నకిలీ కేవైసీ కాల్స్, ఫేక్ లింక్‌లపై క్లిక్ చేయించి డబ్బులు దొంగిలించడం, ఫిషింగ్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్‌లు రావడం వంటివి ఉన్నాయి. వీటన్నిటినీ నిరోధించడానికి గూగుల్ భారతదేశం కోసం ప్రత్యేక సేఫ్టీ విధానాన్ని రూపొందించింది.

ఈ ఛార్టర్‌లో ఏయే యాప్‌లు చేరతాయి?

గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్‌పే, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి అనేక ప్రముఖ పేమెంట్స్ యాప్స్, ఇతర డిజిటల్ కంపెనీలు ఈ ఛార్టర్‌లో భాగమవుతాయి. అవి తమ యాప్‌లను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మారుస్తాయి.

Tags:    

Similar News