Google Alert: గూగుల్‌ అలర్ట్‌.. ఈ ప్రమాదకరమైన యాప్‌లని తొలగించండి..!

Google Alert: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.

Update: 2023-08-11 15:45 GMT

Google Alert: గూగుల్‌ అలర్ట్‌.. ఈ ప్రమాదకరమైన యాప్‌లని తొలగించండి..!

Google Alert: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు. గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 43 ఆండ్రాయిడ్ యాప్‌లను తొలగించింది. ఎందుకంటే మొబైల్‌ స్క్రీన్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ఈ యాప్‌లు యాడ్స్‌ని లోడ్‌ చేస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వారు ఫోన్‌ల నుంచి ఈ యాప్‌లను తొలగించాలి. లేదంటే తొందరగా బ్యాటరీ ఖర్చవుతుంది.

Google నిబంధనలని ఉల్లంఘించినందుకు ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్స్‌ తొలగించింది. అంతేకాకుండా ఈ అప్లికేషన్‌లు అధిక డేటాను ఉపయోగిస్తున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి సహకరిస్తున్నాయి. ఇది బ్యాంకింగ్ మోసాలకి దారితీయవచ్చు. ఈ కారణాల వల్ల Google ఈ అప్లికేషన్‌లను తొలగించింది. టీవీ/DMB ప్లేయర్, మ్యూజిక్ డౌన్‌లోడర్, న్యూస్‌, క్యాలెండర్ వంటి యాప్‌లను కలిగి ఉన్న కొన్ని అప్లికేషన్‌లను Google తొలగించింది.

బ్యాటరీ చెక్‌ చేయండి

మొబైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ వినియోగాన్ని చెక్‌చేయండి. ఏ యాప్‌లు ఎక్కువగా బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో తెలుస్తుంది. అలాగే స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు అవి రన్ అవుతూ ఉన్నాయో లేదో చూడండి. వినియోగదారులు యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసే ముందు ముందుగా వాటి సమీక్షలను చదవాలి. యాప్ ఖచ్చితత్వం, భద్రత గురించి తెలుసుకోవాలని గూగుల్‌ సూచించింది.

Tags:    

Similar News