Google Pixel 9 Offer: చౌకగా మారిన గూగుల్ పిక్సెల్.. రూ.15 వేల డిస్కౌంట్.. వెంటనే ఆర్డర్ చేయండి..!

Google Pixel 9 Offer: గత ఏడాది గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ 9ని విడుదల చేసింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ఇందులో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను ప్రవేశపెట్టింది. మంచి డిజైన్, లుక్, ఫీచర్ల కారణంగా దీని ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది.

Update: 2025-03-15 14:30 GMT

Google Pixel 9 Offer: చౌకగా మారిన గూగుల్ పిక్సెల్.. రూ.15 వేల డిస్కౌంట్.. వెంటనే ఆర్డర్ చేయండి..!

Google Pixel 9 Offer: గత ఏడాది గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ 9ని విడుదల చేసింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ఇందులో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను ప్రవేశపెట్టింది. మంచి డిజైన్, లుక్, ఫీచర్ల కారణంగా దీని ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే, మీరు ఈ ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. మీరు ఈ ఫోన్‌ను 15,000 రూపాయలకు చౌకగా కొనుగోలు చేయచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Google Pixel 9 Exchange Offer

గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది, ఇది స్మార్ట్‌ఫోన్‌ను మార్చాలనుకునే వారికి చాలా మంచి అవకాశం. ఈ ఆఫర్‌తో మీరు ఈ ఫోన్‌ను సాధారణ ధర కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు.

Google Pixel 9 Flipkart Offers

గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,999, కానీ, ఎటువంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా 6శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు,ఈ కారణంగా దీని ధర రూ.74,999 అయింది. ఈ విధంగా మీరు నేరుగా రూ. 5,000 ఆదా చేసుకోవచ్చు. కానీ, ఆఫర్లు ఇంతటితో అయిపోలేదు.

ఇది కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ. 10,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. మీకు కావాలంటే, మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. ఈ మొబైల్‌పై మంచి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Google Pixel 9 Specifications

గూగుల్ పిక్సెల్ 9 ఫోన్‌లో 6.3 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ 1080 x 2424 పిక్సెల్‌లు. అలానే ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 2700 నిట్‌లు, HDRకి కూడా సపోర్ట్ ఇస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్లను అందిస్తుంది. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటక్షన్ అందించారు.

గూగుల్ పిక్సెల్ 9లో టెన్సర్ G4 ప్రాసెసర్‌ , 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది కాకుండా, ఈ హ్యాండ్‌సెట్‌లో 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700 mAh బ్యాటరీ ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ కోసం 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Tags:    

Similar News