Google Meet Free Calls: సెప్టెంబర్ 30 వరకు ఫ్రీ కాల్స్

Google Meet Free Calls: గతేడాది నుంచి కోవిడ్ తో చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం ను అందిస్తున్నాయి.

Update: 2021-03-31 12:35 GMT

గూగుల్ మీట్ (ఫొటో: ది హన్స్ ఇండియా)

Google Meet Free Calls: గతేడాది నుంచి కోవిడ్ తో చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం ను అందిస్తున్నాయి. దీంతో ఆన్ లైన్ వీడియో కాల్స్, మీటింగ్ లకు డిమాండ్ బాగా పెరగడంతో చాలా యాప్స్ వెలుగులోకి వచ్చాయి. వీటిలో జూమ్ బాగా పాపులర్ అయింది. అయితే, గూగుల్ మీట్ ను బాగా డెవలప్ చేసి ఉచిత కాల్స్ తో తన సేవలను విస్తరించింది గూగుల్. పెయిడ్ సేవలను గూగుల్ ఫ్రీ గా అందిస్తోంది.

కాగా, ఈ ఫ్రీ కాల్స్ గతేడాది సెప్టెంబర్ 30 వరకే అందించాల్సి ఉంది. కానీ, మరిత మంది యూజర్స్ ను ఆకర్షించే పనిలో భాగంగా ఈ రోజు (మార్చి 31, 2021) వరకు పొడిగించింది. అయితే యూజర్ల నుంచి వస్తోన్న స్పందన చూసి మరోసారి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది గూగుల్. గూగుల్ మీట్ యూజర్లు ఉచితంగా కాల్స్ ను కొనసాగించవచ్చని గూగుల్ పేర్కొంది.

గూగుల్ మీట్ అన్‌లిమిటెడ్ కాలింగ్ ఫీచర్ ను యూజర్లు 24 గంటల పాటు వాడుకోవచ్చు. అయితే, జీమెయిల్ లేని వారికి మాత్రం కేవలం 60 నిమిషాలు మాత్రమే కాలింగ్ చేసుకోవచ్చు. అదే జీమెయిల్ తో అనుసంధానం చేస్తే మాత్రం 24 గంటలపాటు ఈ ఫ్రీ కాలింగ్ ఫీచర్ ను వాడుకోవచ్చని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందున, వర్క్ ఫ్రం హోం ను పొడిగించే ఆలోచనలో చాలా కంపెనీలు ఉన్నాయి. దీంతో గూగుల్ మీట్ మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

గూగుల్ మీట్ కాలింగ్ లో 250 మంది వరకు పాల్గొనవచ్చు. అలాగే సమావేశాలను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే సర్వేలు, ప్రశ్నలు, మీటింగ్ రూమ్స్, రిపోర్టులు లాంటివి దీనితో తయారుచేసుకోచ్చని గూగుల్ తెలిపింది. కేవలం ఈ ఫీచర్లు గూగుల్ మీట్ లో మాత్రమే లభిస్తాయని తెలిపింది. ఈ ఫీచర్లతోనే మీట్ బాగా ప్రాచుర్యం పొందుతోందని పేర్కొంది. మరిన్న కొత్త ఫీచర్లను త్వరలో అందిస్తామని తెలిపింది.

Tags:    

Similar News