Google Photos: జూన్ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు

Google Photos: గూగుల్ తమ యూర్లనుంచి ఛార్జీలను వసూలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది.

Update: 2021-05-10 16:45 GMT

గూగుల్ ఫొటోస్ (ఫొటో ట్విట్టర్)

Google Photos: గూగుల్ తమ యూర్లనుంచి ఛార్జీలను వసూలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు యూజర్లు స్టోరేజీ ప్లాన్లను ఎంచుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన స్టోరేజీని, త్వరలోనే ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి పెయిడ్ సేవలను అందిచనుంది.

గూగుల్ ఫోటోలు ప్రస్తుతం వినియోగదారులకు అపరిమితంగా ఫొటోలను స్టోరేజీ చేసుకునే వీలుంది. కానీ, జూన్ 1 నుంచి వినియోగదారులు సుమారు 15GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా పొందుతారు. అంతకుమించి స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే.

మీరు 15GB ఉచిత పరిమితి నిండిపోయాక, క్లౌడ్ స్టోరేజ్‌లో కొత్త ఫొటోలను దాచుకోవాలంటే మాత్రం.. ప్రతి నెలా దాదాపు రూ.146 లు గూగుల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గూగుల్ సభ్యత్వంలో భాగాంగా ఉంటుంది. అలా కాకుండా ఏడాది ప్లాన్ తీసుకోవాలంటే దాదాపు రూ. 1464లు ప్రతి ఏటా చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, 2021 జూన్ 1 నుంచి గూగుల్ ఫోటోలలో "అధిక నాణ్యత" ఫోటోల కోసం ఉచిత స్టోరేజీని అందించబోమని నవంబర్ 2020 లో నే ప్రకటించింది. అయితే, గూగుల్ పిక్సెల్ 2 లేదా ఈ ఫోన్లను వాడే యూజర్లు మాత్రం ఉచితంగా స్టోరీజీని వాడుకోవచ్చిన ప్రకటించింది. వారు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదంది.

Tags:    

Similar News