Google Pixel 8 Discounts: నెవర్ బిఫోర్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8పై రూ.30,000 డిస్కౌంట్..!
Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8పై మరోసారి ఆఫర్ల వర్షం కురుస్తోంది. గూగుల్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
Google Pixel 8 Discounts: నెవర్ బిఫోర్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8పై రూ.30,000 డిస్కౌంట్..!
Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8పై మరోసారి ఆఫర్ల వర్షం కురుస్తోంది. గూగుల్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఫోన్ ధరను 36శాతం వరకు తగ్గించింది. అంతే కాకుండా ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. గత ఏడాది ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించిన ఫెస్టివల్ సీజన్ సేల్‌లో ఈ గూగుల్ ఫోన్ బాగా అమ్ముడైంది. ఈ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలో ఫోన్ ధర, ఫీచర్స్, ఆఫర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Google Pixel 8 Offers
ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌లో ఈ ఫోన్ మరోసారి చౌక ధరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పిక్సెల్ 8 256జీబీ వేరియంట్‌ని రూ. 82,999 లాంచ్ చేయగా, ఆఫర్స్‌పై రూ. 52,999కి ఆర్డర్ చేయచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. అలానే ఫోన్ కొనుగోలుపై ప్రత్యేకంగా రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.
Google Pixel 8 Specifications
పిక్సెల్ 8లో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.2 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ గూగుల్ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో టెన్సర్ G3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
ఈ గూగుల్ ఫోన్ AI ఫీచర్‌తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 4,575mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB టైప్ C 30W ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 10.5MP కెమెరా ఉంది.