Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సేల్.. శాంసంగ్, వివో, నథింగ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!
ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ రేపు అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో జరిగే ఈ సేల్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సేల్.. శాంసంగ్, వివో, నథింగ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ రేపు అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో జరిగే ఈ సేల్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. శాంసంగ్, వివో, నథింగ్ వంటి బ్రాండ్‌ల నుండి కొత్త ఫోన్‌లను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లకు ఆఫర్‌లు 12:00 ఉదయం నుండి లైవ్ అవుతాయి. సాధారణ వినియోగదారుల కోసం, అక్టోబర్ 12న 12:00 ఉవయం నుండి సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
నథింగ్
ఈ సంవత్సరం ప్రారంభించిన నథింగ్స్ మిడ్-బడ్జెట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.24,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన ఈ ఫోన్ ఈ సేల్‌లో రూ.4,000 తక్కువకు అందుబాటులో ఉంటుంది. దీనిని రూ.20,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా, 5000mAh బ్యాటరీతో పాటు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ
ఈ రియల్‌మీ ఫోన్ సేల్‌లో కేవలం రూ.26,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 6.8-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్
ఈ శాంసంగ్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ కొనుగోలుపై వేల రూపాయల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను రూ.13,999 ప్రారంభ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
వివో
ఈ వివో ఫోన్ రూ.17,499 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 5700mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వివో ఫోన్ కొనుగోలుపై 10శాతం ఇన్‌స్టంట్ బ్యాక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.