Flipkart iPhone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ఐఫోన్ల ధర భారీగా డిస్కౌంట్లు..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 23 నుండి సంవత్సరంలో అతిపెద్ద అమ్మకాలలో ఒకటైన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ను ప్రారంభించనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ మోడళ్లపై అందిస్తున్న ఆఫర్లు ఇప్పటికే వినియోగదారుల దృష్టిని ఆకర్షించాయి. దీని గురించి పూర్తి సమాచారాన్ని పరిశీలిద్దాం.

Update: 2025-09-12 11:40 GMT

Flipkart iPhone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ఐఫోన్ల ధర భారీగా డిస్కౌంట్లు..!

Flipkart iPhone Offers: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 23 నుండి సంవత్సరంలో అతిపెద్ద అమ్మకాలలో ఒకటైన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ను ప్రారంభించనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ మోడళ్లపై అందిస్తున్న ఆఫర్లు ఇప్పటికే వినియోగదారుల దృష్టిని ఆకర్షించాయి. దీని గురించి పూర్తి సమాచారాన్ని పరిశీలిద్దాం.

iPhone 14 Offers

సెప్టెంబర్ 2022లో ప్రారంభించిన ఐఫోన్ 14 (128GB) మోడల్ ప్రారంభ ధర భారతదేశంలో రూ.79,900. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.52,990కి అమ్ముడవుతోంది. కానీ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ మోడల్‌ను యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులపై డిస్కౌంట్‌లతో సహా కేవలం రూస39,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ధర పరంగా, ఇది ఐఫోన్ ప్రియులకు చాలా ఆకర్షణీయమైన అవకాశం.

iPhone 16 Pro Series Offers

ఐఫోన్ 14 మాత్రమే కాదు, గత సంవత్సరం ప్రారంభించిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ పెద్ద డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ మోడల్స్ ధర వరుసగా వరుసగా రూ.1,19,900, రూ.1,44,900గా ఉండేది, ఈ సేల్ సమయంలో, బ్యాంక్ ఆఫర్‌లతో సహా, ఐఫోన్ 16 ప్రో రూ.70,000 కంటే తక్కువకు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.90,000 కంటే తక్కువకు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ ధర తగ్గింపు ఒక పెద్ద అవకాశం.

iPhone 17 Series Offers

ఇంతలో యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 17 సిరీస్‌ను భారత మార్కెట్‌కు తీసుకువచ్చింది. ఐఫోన్ 17 (256GB) మోడల్ ప్రారంభ ధర రూ.82,900, అయితే ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్‌ల ధర ఇంకా ఎక్కువగా ఉంది. కొత్త A19 చిప్‌సెట్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, ఆల్వేస్-ఆన్ స్క్రీన్, 48MP ఫ్యూజన్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో ఐఫోన్ 17 కొత్త తరం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రో మోడల్స్‌లో అదనపు టెలిఫోటో లెన్స్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Tags:    

Similar News