Motorola Edge 50 Neo Discounts: చివరి ఛాన్స్.. మోటో ట్రిపుల్ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Motorola Edge 50 Neo Discounts: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ చివరి రోజుకు చేరుకుంది.

Update: 2025-02-28 09:30 GMT

Motorola Edge 50 Neo Discounts: చివరి ఛాన్స్.. మోటో ట్రిపుల్ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Motorola Edge 50 Neo Discounts: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ చివరి రోజుకు చేరుకుంది. మీరు సరికొత్త ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలంటే ఇదే చివరి అవకాశం. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అనేక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇందులో 'Motorola Edge 50 Neo' మొబైల్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అలానే కొన్ని బ్యాంక్ కార్డుల ద్వారా డిస్కౌంట్స్, క్యా‌ష్‌బ్యాక్స్ లభిస్తున్నాయి. రండి.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo Offers

ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో మోటరోలా ఎడ్జ్ 50 నియో 256 జీబీ వేరియంట్‌పై గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ. 29,999 ధరతో లాంచ్ చేసింది, కానీ ఇప్పుడు ఫోన్‌పై 30శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కారణంగా ధర రూ. 20,999గా మారుతుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. రూ. 13,700 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ధర రూ.10,000 వరకు తగ్గుతుంది. అయితే, ఈ ఆఫర్ మీ ఫోన్ పరిస్థితి, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

Motorola Edge 50 Neo Features

ఈ మోటో స్మార్ట్‌ఫోన్లో 6.4 అంగుళాల LTPO P-OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌, 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అందులో 50MP + 10MP + 13MP కెమెరా సెటప్‌ చూడొచ్చు. అయితే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు.

Tags:    

Similar News