Google Pixel 8: డెడ్ చీప్.. గూగుల్ ఫోటోల ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్

Update: 2025-03-09 13:00 GMT

Google Pixel 8: డెడ్ చీప్.. గూగుల్ ఫోటోల ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్

Google Pixel 8: ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే, గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల పేరు అగ్రస్థానంలో ఉంటుంది. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే ఇవి చాలా ఖరీదైనవి. అయితే ఇప్పుడు మీరు 'Google Pixel 8'ని భారీ డిస్కౌంట్‌తో దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌తో గొప్ప ఫోటోగ్రఫీ చేయడమే కాదు, ఈ స్మార్ట్‌ఫోన్ మీకు మల్టీ-టాస్కింగ్‌లో కూడా గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌పై రూ. 30 వేల కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Google Pixel 8 Offers

గూగుల్ ప్రీమియం ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం మీరు గూగుల్ పిక్సెల్ 8 256 జీబీ వేరియంట్‌పై రూ.33 వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 82,999కి లాంచ్ అయింది. అయితే ఫ్లిప్‌కార్ట్ హోలీకి ముందు ధరను 39శాతం తగ్గించింది. ఈ ఆఫర్‌తో మీరు దీన్ని కేవలం రూ.49,999తో కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన ఎక్స్ఛేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,200 వరకు మార్చుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి విలువను పొందినట్లయితే, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.22,799కి ఆర్డర్ చేయచ్చు.

Google Pixel 8 Features And Specifications

గూగుల్ పిక్సెల్ 8 2022లో మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ అల్యూమినియం ఫ్రేమ్‌తో డిజైన్ చేసింది. ఇందులో కంపెనీ 6.2 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించింది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం Google Pixel 8లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50 + 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. పవర్ కోసం కంపెనీ 4575mAh బ్యాటరీని అందించింది. ఈ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News