Facebook: యూజర్లకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్ లోకి భారీగా డబ్బులు.. ఇలా అప్లై చేస్తే చాలు..!

Facebook: మీరు ఫేస్ బుక్ వాడుతున్నారా..?? అయితే రూ.6వేల కోట్ల పరిహారంలో మీకు వాటా వచ్చే ఛాన్స్ ఉంది.

Update: 2023-04-25 02:30 GMT

Facebook: యూజర్లకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్ లోకి భారీగా డబ్బులు.. ఇలా అప్లై చేస్తే చాలు..!

Facebook: మీరు ఫేస్ బుక్ వాడుతున్నారా..?? అయితే రూ.6వేల కోట్ల పరిహారంలో మీకు వాటా వచ్చే ఛాన్స్ ఉంది. ఔను, ఫేస్ బుక్ అనలిటికా స్కాంలో..నష్ట పరిహారం కింద యూజర్లకు రూ.5,955 కోట్లను చెల్లించేందుకు మెటా సంస్థ అంగీకరించింది. విషయం ఏంటంటే వినియోగదారుల సీక్రెసీకి భంగం కలిగించిందనే ఆరోపణలతో ఫేస్ బుక్ పై గతంలో కేసు నమోదు అయింది.

ప్రముఖ బ్రిటీష్ పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాతో పాటు ఇతర థర్డ్ పార్టీలు..యూజర్ల పర్సనల్ ఇన్ ఫర్మేషన్ ను యాక్సెస్ చేసేలా ఫేస్ బుక్ వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై అప్పట్లో ఇంటర్నేషనల్ గా నిరసనలు వ్యక్తం అయ్యాయి కూడా. ఈ వ్యవహారంపై నాలుగేళ్ల పోరాటం అనంతరం యూజర్లకు 725 మిలియన్ల పరిహారం చెల్లించేందుకు ఫేస్ బుక్ ఒప్పుకుంది. ఈ కేసులో సెటిల్ మెంట్ చేసుకునేందుకు కాలిఫోర్నియా జడ్జి ప్రాథమిక ఆమోదం తెలిపారు. దీంతో ఫేస్ బుక్ ఇచ్చే పరిహారం కోసం క్లెయిన్ చేసుకునేందుకు యూజర్లకు వీలు కలిగింది.

ఎలా క్లయిమ్ చేసుకోవాలి:

పరిహారంలో వాటా కోసం యూజర్లు కొన్ని వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. Facebookuserprivacysettlement.com వెబ్ సైట్ కు వెళ్లి submit claim పైన క్లిక్ చేయాలి. అనంతరం ఒక ఆన్ లైన్ ఫారం నింపాలి. లేదంటే దాన్ని ప్రింట్ తీసి పోస్ట్ చేయొచ్చు. ఆన్ లైన్ లో అయితే..ఫామ్ నింపడానికి కొన్ని నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంటుంది. పోస్ట్ ను ఆగస్ట్ 25లోపు సమర్పించాలి.

ఎవరు అర్హులు అంటే:

2007 మే 24 నుంచి 2022 డిసెంబర్ మధ్య అమెరికాలో ఉండి ఫెస్ బుక్ అకౌంట్‌ కలిగిన వారికి ఈ పరిహారాన్ని చెల్లించనున్నారు. అయితే మీరు ప్రస్తుతం ఫేస్ బుక్ వాడకపోయినా..అకౌంట్లను తొలిగించినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత చెల్లిస్తారనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే సెటిల్ మెంట్ కు ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆమోదం తెలిపిన తర్వాత...చెల్లింపులు చేస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News