POCO X6 Neo 5G: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. పోకో ప్రీమియం ఫోన్‌పై 40% డిస్కౌంట్
POCO X6 Neo 5G: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. పోకో ప్రీమియం ఫోన్‌పై 40% డిస్కౌంట్
POCO X6 Neo 5G: మార్కెట్‌లో పోకో బ్రాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు బాగా ఫేమస్. పోకో కంపెనీ తన బడ్జెట్ ఫోన్‌లలో ప్రీమియం ఫీచర్లను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాడి 'POCO X6 Neo 5G' స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు 108 MP కెమెరా ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై ఈ-కామర్స్ సైట్ అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది.
పోకో X6 నియో 5G ఆఫర్
ఈ పోకో ఫోన్‌పై అమెజాన్‌లో 40 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. వాస్తవానికి కంపెనీ ఈ ఫోన్‌ను రూ.19,999 ధరకు లాంచ్ చేసింది. కానీ తాజాగా ఇస్తున్న 40 శాతం డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ కేవలం రూ. 11,999 కే లభిస్తోంది. అలానే బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను బుక్ చేస్తే అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇదే కాకుండా, ఫోన్‌పై ఎక్స్ఛేంజ్, ఈఎమ్ఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పోకో X6 నియో 5G ఫీచర్స్
ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమ్లోడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, అల్ట్రా-నారో బెజెల్స్‌తో 93.30 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ డిస్‌ప్లేకి ఉంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 6ఎన్ఎమ్ ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.4GHz గా ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం 8GB వర్చువల్ ర్యామ్‌తో సహా మొత్తం 16GB ర్యామ్ ఉంటుంది.
కెమెరా సిస్టమ్ విషయానికొస్తే... ఫోన్‌లో108MP AI డ్యూయల్ కెమెరా ఉంది. ఇందులో 3X ఇన్-సెన్సర్ జూమ్ ఉంది. సెల్ఫీలు కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇక పవర్ విషయానికి వస్తే.. ఫోన్‌లో పెద్ద 5000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫైల్స్, డేటా స్టోర్ చేయడానికి 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.