AC Tips: ఏసీ ఆన్‌లో పడుకుంటే హుమిడిటీ పెరిగిపోతుందా? అయితే ఈసారి ఏసి ఆన్ చేస్తే.. ఇలా చేయండి
AC Tips: చాలామంది బయట వానలు పడుతున్నా కూడా ఏసీ ఆన్‌లో లేకపోతే నిద్రపోరు. రాత్రంతా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. అయితే ఇలా రెగ్యులర్‌గా ఏసీని ఆన్ చేసి పడుకునేవారు వారికి తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదంలో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
AC Tips: ఏసీ ఆన్‌లో పడుకుంటే హుమిడిటీ పెరిగిపోతుందా? అయితే ఈసారి ఏసి ఆన్ చేస్తే.. ఇలా చేయండి
AC Tips: చాలామంది బయట వానలు పడుతున్నా కూడా ఏసీ ఆన్‌లో లేకపోతే నిద్రపోరు. రాత్రంతా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. అయితే ఇలా రెగ్యులర్‌గా ఏసీని ఆన్ చేసి పడుకునేవారు వారికి తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదంలో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండు గంటల కంటే ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉండేవారికి హుమిడిటీ పెరిగిపోతుందని, దీనివల్ల కళ్లు పొడిబారిపోవడం, చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కాలంతో సంబంధం లేకుండా చాలామంది ఏసీ లేనిదే నిద్రపోరు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అందరూ ఇప్పుడు ఏసీలకు బాగా అలవాటు పడిపోయారు. అయితే సరిగా పరిశీలించి చూస్తే ఏసి ఆనై రెండు గంటల తర్వాత రూమ్‌లో తేమ సాంద్రత పెరిగిపోతుంది. గది చల్లగానే ఉంటుంది కానీ హుమిడిటీ పెరిగిపోతుంది. ఏదో ఊపిరి అందడం లేని భావన కలుగుతుంది. ఇలా జరగడం వల్ల నెమ్మది నెమ్మదిగా శ్వాసకోశ వ్యాధులు, చర్మపు వ్యాధులు, కళ్లు పొడిబారడం, అలర్జీలు, అంటు వ్యాధులు వంటివి వచ్చేప్రమాదం ఉంది. అందుకే ఇవి రాకుండా ఉండాలంటే గదిలో హుమిడిటీ లేకుండా చూసుకోమని నిపుణులు చెబుతున్నారు.
అధిక తేమ ఎందుకు వస్తుంది?
ఏసీ ఆన్ చేసినప్పుడు గది టెంపరేచర్ ఒకలా ఉంటుంది. ఆ తర్వాత గది టెంపరేచర్ మారుతుంది. అయితే కొంతమంది ఒక్కసారి ఎక్కువ ఏసీని పెడుతుంటారు. దీనివల్ల గది తొందరగా కూల్ అవుతుంది. కానీ హుమిడిటీ ఎక్కువగా వస్తుంది. అదే రూమ్ టెంపరేచర్ సెట్ అయ్యేంతవరకు తక్కువ కూలింగ్‌ని పెడితే హుమిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
హుమిడిటీని ఎలా తగ్గించాలి?
హుమిడిటీ అనేది అసలు గదిలో ఉండకూడదు అంటే మీరు ఈ చిట్కాన్ని పాలో అవ్వాలి. అదేంటంటే.. ఏసి గదిలో ఒక మూలన బకెట్ నీళ్లను పెట్టాలి. దీనివల్ల గది టెంపరేచర్ ఒక్కసారిగా పెరగడం, తగ్గిపోవడం వంటివి జరగవు. ఈ చిట్కా ఒక మూడ నమ్మకం కాదు. ఇదొక సైన్స్ మెథడ్. ఇలా నీళ్లున్న బకెట్ ని ఒక గదిలో పెట్టడం వల్ల హుమిడిటీ తగ్గుతుంది. ఈ నీటిలో ఇంకొంచెం ఫేవర్స్‌ని యాడ్ చేస్తే ఇంకా మంచిది. గది అంతా సువాసన వస్తుంది.