Smartphone: స్మార్ట్‌ఫోన్‌ ఛార్జ్‌ చేస్తున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..!

Smartphone: ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అందరు ఎదుర్కొనే సాధారణ సమస్య చార్జింగ్‌ అయిపోవడం.

Update: 2022-06-27 05:30 GMT

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ ఛార్జ్‌ చేస్తున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..!

Smartphone: ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో అందరు ఎదుర్కొనే సాధారణ సమస్య చార్జింగ్‌ అయిపోవడం. దీనిని ఎదుర్కోవాలంటే బ్యాటరీ జీవితాన్ని కాపాడుకోవాలి లేదా పెంచుకోవాలి. అయితే మీరు చేసే కొన్ని తప్పుల వల్లే బ్యాటరీ తొందరగా అయిపోతుంది. అంతేకాదు ఎక్కువకాలం రావడం లేదు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జ్ చేసేటప్పుడ 100% వరకు ఛార్జింగ్ చేసే అలవాటు మానుకోండి. ఇది చెడ్డ ఛార్జింగ్ అలవాటు. ఇది బ్యాటరీకి హాని చేస్తుంది. అలాగే బ్యాటరీ 0% స్థాయికి చేరే వరకు ఫోన్‌ను ఉపయోగించడం మంచిది కాదు.

2. బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయడానికి ఎల్లప్పుడూ ఫోన్‌ను 90% వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫోన్‌ని 30%కి చేరుకునే వరకు ఉపయోగించడం కొనసాగించవచ్చు. తర్వాత ఛార్జింగ్‌ చేస్తే సరిపోతుంది.

3. మీ పరికరం 100% ఛార్జ్ అయిన తర్వాత అది స్మార్ట్‌ఫోన్‌కు శక్తిని సరఫరా చేయదని మనలో చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదని గుర్తుంచుకోండి. ఎప్పటిలాగే 90% ఛార్జ్ అయిన వెంటనే ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయడం మర్చిపోవద్దు.

4. రాత్రిపూట ఛార్జింగ్ చేసే అలవాటును వెంటనే మానేయండి. ఎక్కువసేపు ఛార్జింగ్ చేయడం వల్ల మెటాలిక్ లిథియంపై దాడి జరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. కాబట్టి రాత్రిపూట మీ పరికరాన్ని ఛార్జ్ చేయవద్దు.

5. బ్యాటరీ లైఫ్‌ని పెంచడానికి ఫోన్‌ను ఉదయం, సాయంత్రం ఒకసారి ఛార్జ్ చేయడం మంచి అలవాటు. అలాగే ఫోన్‌ ఛార్జ్ అవుతున్నప్పుడు ఉపయోగించడం చెడ్డ అలవాటు. ఇది ఖచ్చితంగా మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని తగ్గించడానికి ఒక కారణం.

Tags:    

Similar News