D2M: మొబైల్ డేటా లేకుండానే లైవ్ టీవీ.. అందుబాటులోకి కొత్త టెక్నాల‌జీ..!

D2M Technology in India: ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల వీడియోలు బఫర్ అవ్వడం అందరినీ ఇబ్బంది పెడుతోంది.

Update: 2025-05-15 11:30 GMT

D2M: మొబైల్ డేటా లేకుండానే లైవ్ టీవీ.. అందుబాటులోకి కొత్త టెక్నాల‌జీ

D2M Technology in India: ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల వీడియోలు బఫర్ అవ్వడం అందరినీ ఇబ్బంది పెడుతోంది. అలాంటి సమయంలో డేటా అవసరం లేకుండా మొబైల్‌లోనే టీవీ చూడగలిగితే ఎంత మంచిదో కదా! దీనికి సమాధానమే డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ.

D2M అంటే ఏమిటి?

D2M అనేది బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ. టెలివిజన్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని మొబైల్‌ఫోన్ నేరుగా అందుకోగల సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. అంటే నెట్ కనెక్షన్ లేకుండానే లైవ్ టీవీ, వీడియోలు, ఆడియోలు, మెసేజ్‌లు మొబైల్‌కి వ‌స్తాయి. ఇది ఎఫ్‌ఎం రేడియోలా పనిచేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది.?

టెక్నాలజీని పనిచేయించే ప్రత్యేకమైన చిప్ – SL3000 –ను బెంగళూరులోని సాంఖ్య ల్యాబ్స్ తయారు చేసింది. ఈ చిప్ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే అది ప్రసార్ భారతితో లింకైన టీవీ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ని స్వీకరిస్తుంది. అంటే మొబైల్ డేటా, వైఫై అవసరం లేకుండానే కంటెంట్ చూడవచ్చు.

ఈ సిస్టమ్ ATSC 3.0 అనే నూతన బ్రాడ్‌కాస్ట్ స్టాండర్డ్‌ను ఉపయోగిస్తుంది. దీనితో హై క్వాలిటీ వీడియోలు, ఆడియోలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు, ఢిల్లీ, నోయిడాలో D2M పైలట్ టెస్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి రావడమే మిగిలి ఉంది.

ప్రయోజనాలు ఏమిటి?

ఇంటర్నెట్ అవసరం లేకుండానే కంటెంట్‌ అందుబాటులోకి వస్తుంది. మొబైల్ డేటా ఖర్చులు తగ్గుతాయి. 5జీ నెట్‌వర్క్ మీద పడి ఉన్న లోడ్‌ తగ్గుతుంది. పల్లెలు, అడవులు, ఇంటర్నెట్ లేకున్నా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అత్యవసర సమయాల్లో అలర్ట్స్ పంపే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ సాధారణ ప్రజలకు వినియోగాన్ని మరింత సులభతరం చేయనుంది. త్వరలోనే ఇది వాణిజ్యంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News