Fake Websites: ఈ నకిలీ వెబ్ సైట్స్ జోలికి వెళ్లి మోసపోకండి

Update: 2021-08-18 09:34 GMT

నకిలీ వెబ్ సైట్స్ (ఫైల్ ఫోటో)

Fake Web Sites: ఇంటర్నెట్ లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. అలాంటి ఇంటర్నెట్ లో మన ప్రపంచంలో ఉన్నట్లే మంచి, చెడు అని రెండూ రకాలు ఉన్నాయి. ఎవరు ఎలాంటి విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తారో అనేది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ ని ఉపయోగించి నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు గత కొంతకాలంగా విభిన్న పద్దతుల్లో జనాలను మోసం చేస్తూ నిమిషాల్లోనే వారి అకౌంట్ లో నుండి డబ్బులను మాయం చేస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ లను కట్టడి చేయడానికి సైబర్ పోలీసులు ఎన్నివిధాలుగా చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే ఉంది.

తాజాగా సైబర్ పోలీసులు కొన్ని వెబ్ సైట్స్ జోలికి వెళ్ళకూడదని ప్రజలను హెచ్చరిస్తున్నారు. నకిలీ యాప్స్ తో పాటు ఫేక్ వెబ్ సైట్స్ తో అమాయకులను మోసం చేస్తున్న ఈ సైబర్ నేరగాళ్ల నుండి కొంతవరకైన జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచించారు.

నకిలీ వెబ్ సైట్స్:

డెబిట్

అమెజాన్93.కామ్

ఈబే19.కామ్

లక్కీబాల్

EZప్లాన్

సన్ ఫ్యాక్టరీ.ETC 

Tags:    

Similar News