BSNL Recharge Plans: జియో, ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీనిస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌.. 395 రోజుల వ్యాలిడిటీతో..!

BSNL Recharge Plans: ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.

Update: 2024-12-10 08:16 GMT

BSNL: జియో, ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీనిస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌.. 395 రోజుల వ్యాలిడిటీతో..!

BSNL Recharge Plans: ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రైవేట్ రంగ సంస్థలకు పోటీనిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. తాజాగా 395 రోజుల వ్యాలిడిటీతో ఒక స్పెషల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్‌.? దాని బెనిఫిట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 2399తో ఈ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అలాగే ప్రతీరోజూ ఉచితంగా 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేస్తే ఏడాది పొడవునా 790GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. ఇక యూజర్లు రోజుకు గరిష్టంగా 2 జీబీ హై స్పీడ్‌ డేటాను ఆస్వాదించొచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది.

ఎక్కువకాలం వ్యాలిడిటీతో పాటు ఇంటర్నెట్‌ స్ట్రీమింగ్ చేసుకునే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా బీఎస్‌ఎన్‌ఎల్ గేమ్స్‌తో పాటు మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌ల సేవలను ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వంటి ప్రైవేట్ నెట్‌వర్స్క్‌ ఎందులోనూ ఇలాంటి రీఛార్జ్‌ ప్లాన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీగా ఆదరణ పెరుగుతోంది. ఇతర టెలికం యూజర్లు సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌కు మొగ్గుచూపుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్తగా 5.5 మిలియన్లకుపైగా కొత్త సబ్‌స్క్రైబర్లు చేరినట్లు బీఎస్ఎల్ ఇటీవల ప్రకటించింది. ఇతర టెలికం సంస్థలు టారిఫ్‌లు పెంచిన క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆదరణ పెరుగుతోందని గణంకాలు చెబుతున్నాయి. 

Tags:    

Similar News