BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ప్లాన్‌.. 90 జీబీ డేటాతో మైండ్‌ బ్లోయింగ్‌ వ్యాలిడిటీ పొందే ఛాన్స్‌

BSNL Most Affordable Plan: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఈ ప్రభుత్వ రంగ దిగ్గజా టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే యూజర్లకు రీఛార్జ్ ప్యాక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2025-04-12 03:30 GMT

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ప్లాన్‌.. 90 జీబీ డేటాతో మైండ్‌ బ్లోయింగ్‌ వ్యాలిడిటీ పొందే ఛాన్స్‌

BSNL Most Affordable Plan:


భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఈ ప్రభుత్వ రంగ దిగ్గజా టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే యూజర్లకు రీఛార్జ్ ప్యాక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బంపర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం..

భారత్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) ఎప్పటికప్పుడు కొత్త ప్యాక్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకోవస్తుంది. ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ తాజాగా మరో ప్యాక్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ డేటా కూడా ఎక్కువ పొందుతారు. అయితే దీని ధర చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్స్‌ ఉంటాయి. అయితే ఈ ప్లాన్ 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. దీంతోపాటు అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు.

బీఎస్ఎన్ఎల్ 180 రోజుల ప్లాన్..

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 180 రోజుల ప్లాన్ లో ధర రూ.897 మాత్రమే. దీని వ్యాలిడిటీ అంటే దాదాపు 6 నెలలు పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఫ్రీ కాలింగ్‌తో పాటు రోమింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్ అయినా ఉచితంగా కాల్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. మొత్తంగా ఈ ప్లాన్‌లో హై స్పీడ్ నెట్ కూడా ఉంటుంది. అంటే ప్రతిరోజు డైలీ డేటా లిమిట్ కూడా లేదు. యూజర్లు ఎంత నెట్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ మొత్తం ఉపయోగించవచ్చు. అయితే పూర్తిగా డేటా అయిపోయినా కానీ 40 కేబీపీఎస్ నెట్ పొందుతారు.

బీఎస్ఎన్ఎల్ రూ.151 ప్లాన్..

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులపాటు ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ద్వారా 151 మాత్రమే. ఇందులో 40 జీబీ డేటా పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు వంటివి పొందలేరు. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. అంటే ఇప్పటికే మీ దగ్గర బేస్ ప్లాన్‌ యాక్టివ్ లో ఉంటే ఈ డేటా ప్లాన్ తో మీరు రీచార్జ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News