Best Budget Tablets : ₹15,000 లోపు బెస్ట్ ఆప్షన్స్ ... హానర్ నుంచి రియల్‌మీ వరకు!
₹15,000 లోపు మంచి టాబ్లెట్ కోసం చూస్తున్నారా? విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోం యూజర్లు, ఇంటర్‌టైన్‌మెంట్ లవర్స్ కోసం చక్కటి ఫీచర్లతో టాబ్లెట్లు మార్కెట్లో ఉన్నాయి.
Best Budget Tablets : ₹15,000 లోపు బెస్ట్ ఆప్షన్స్ ... హానర్ నుంచి రియల్‌మీ వరకు!
Best Budget Tablets : ₹15,000 లోపు మంచి టాబ్లెట్ కోసం చూస్తున్నారా? విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోం యూజర్లు, ఇంటర్‌టైన్‌మెంట్ లవర్స్ కోసం చక్కటి ఫీచర్లతో టాబ్లెట్లు మార్కెట్లో ఉన్నాయి. హానర్ ప్యాడ్ X9, రియల్‌మీ ప్యాడ్ 2 లైట్, లెనోవో ట్యాబ్ M11, రెడ్‌మీ ప్యాడ్ SE, నోకియా T10 లాంటి మోడల్స్ శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో ఆకట్టుకుంటున్నాయి.
హానర్ ప్యాడ్ X9 ₹13,999 ధరకు 12.1” హై రెజల్యూషన్ డిస్‌ప్లే, Snapdragon 685 చిప్‌సెట్, 7250mAh బ్యాటరీతో వస్తుంది. చదవడం, వీడియోలు చూడటానికి ఇది బెస్ట్ చాయిస్.
లెనోవో ట్యాబ్ M11 ₹11,799కే 11” 90Hz డిస్‌ప్లే, Helio G88 ప్రాసెసర్, 13MP కెమెరాతో వస్తుంది. మంచి స్క్రీన్ రిస్పాన్స్ కావాలనుకునే వారికి బాగుంటుంది.
రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ ₹14,699 ధరలో 2K స్క్రీన్, Helio G99 ప్రాసెసర్, 8300mAh బ్యాటరీతో వస్తుంది. దీర్ఘకాలిక వినియోగానికి అనువైన ఎంపిక.
రెడ్‌మీ ప్యాడ్ SE ₹10,900కి Snapdragon 680 ప్రాసెసర్, 8000mAh బ్యాటరీతో వస్తుంది. రోజువారీ ఉపయోగం, ఆన్‌లైన్ క్లాసుల కోసం బాగుంటుంది.
నోకియా T10 ₹8,455కే అందుబాటులో ఉండే ఈ 8” స్క్రీన్ టాబ్లెట్ సాధారణ వాడకానికి బెస్ట్ ఆప్షన్.
మీ అవసారాన్ని బట్టి ఎంచుకోండి — పెద్ద డిస్‌ప్లే కావాలంటే హానర్ లేదా రియల్‌మీ, కెమెరా ప్రాధాన్యతైతే లెనోవో, బడ్జెట్ లో అయితే నోకియా బెస్ట్. ఈ టాబ్లెట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. తాజా ఆఫర్లు తప్పక పరిశీలించండి!