5G: 5జీ టెక్నాలజీ ఇలా ఉండబోతుందా..!? 4జీ కంటే 5జీ పదిరెట్లు వేగం

Update: 2021-08-04 12:41 GMT

5జీ నెట్వర్క్ ( Representational Photo)

5G Technology: ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 5జీ(జీ: జెనరేషన్). మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. 1జీ నుండి ప్రపంచం 5జీ వరకు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. మొదట 1జీ లో కాల్స్ మాత్రమే చేసుకునే మనం తరువాత 2జీ లో కాల్స్ అండ్ మెసేజ్ లు, 3జీ లో ఇంటర్నెట్, వైఫై బ్లూటూత్ అందుబాటులో ఉండేవి. ఇక ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ఉపయోగిస్తున్న 4జీ మాత్రం 3జీ కంటే 7 నుండి 8 రెట్లు వేగవంతంగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిన 5జీ మాత్రం బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉండటం వల్ల 4జీ కంటే 5జీ పది రెట్లు ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది.

ఉదాహరణకి ఒక సినిమాని 4జీ లో డౌన్లోడ్ చేయాలంటే 10 నిమిషాల సమయం పడితే అదే సినిమా 5జీలో డౌన్లోడ్ చేయాలంటే కేవలం ఒక నిమిషం సమయం పడుతుందంటే అర్ధం చేసుకోవచ్చు 5జీ స్పీడ్. ఇక 4జీ లో 3-6 జిగా హెడ్జ్ బ్యాండ్ విడ్త్ ఉంటే 5జీలో మాత్రం 28-39 వరకు బ్యాండ్ విడ్త్ ఉండటంతో మొబైల్ సిగ్నల్ తరంగాలు కూడా మొబైల్ కి చేరుకోవడానికి కష్టమనే చెప్పాలి. అందుకొరకు 5జీ నెట్వర్క్ కొరకు 4జీ లాగా ఒక ప్రాంతంలో ఒకటి రెండు సిగ్నల్ టవర్స్ లా కాకుండా సుమారుగా ప్రతి ఒక వీధికి ఒక చిన్న టవర్ లేదా అన్టినా వంటివి ఏర్పరిస్తే తప్ప ఆ తరంగాలు చెట్లను, గోడల వంటి వాటిని దాటుకొని రాలేవని తెలుస్తుంది.

అందుచేత మల్టీపుల్ ఇన్పుట్ మరియు మల్టిపుల్ ఔట్ పుట్ వలన 5జీ టవర్ నుండి వెలువడే తరంగాలు సబ్ టవర్ అంటే మనకు దగ్గరలో ఏర్పాటు చేసిన అన్టినా లేదా చిన్న టవర్లకు ఫ్రీక్వెన్సీ చేరి ఎలాంటి ఇబ్బంది లేకుండా 1 మిల్లి సెకన్ లాటెన్సి తో బఫర్ అనే సమస్యే లేకుండా ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు. భవిష్యత్తులో ఇంట్లో లైట్ ఆన్ చేయాలన్న ఆఫ్ చేయాలన్న, కారు నడుపాలన్న, ఎలాంటి పనులకైనా 5జీ వంటి నెట్వర్క్ స్పీడ్ ఉంటేనే సాధ్యం కాబట్టి మున్ముందు 5జీ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండే విధంగా పలు టెలికాం సంస్థలు పోటీపడి పని చేస్తున్నాయి. 

Tags:    

Similar News