Battle Ground Mobile India Game: పబ్జి ప్రియులకు శుభవార్త

Battle Ground Mobile India:కాస్త సమయం దొరికితే మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియా మరియు ఇతరత్రా గేమ్స్ లో మునిగిపోయే యువత...

Update: 2021-07-04 13:52 GMT

బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా ( ఫోటో : డిఎన్ఏ ఇండియా)

Battle Ground Mobile India: కాస్త సమయం దొరికితే మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియా మరియు ఇతరత్రా గేమ్స్ లో మునిగిపోయే యువత ఇటీవల కేంద్ర కేంద్ర ప్రభుత్వం పబ్జి మరియు టిక్ టాక్ వంటి అప్లికేషన్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించడంతో కాస్త నిరాశ చెందారు. అయితే టిక్ టాక్ కి బదులుగా ఇన్స్టా గ్రామ్ లో రీల్స్ తో సర్దుకుంటే పబ్జి ప్రియులు మాత్రం ప్రస్తుతం ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా" ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జూలై 2 న మన దేశంలో ప్రారంభించారు. క్రాఫ్టన్ సిఇఒ సిహెచ్ కిమ్ మాట్లాడుతూ "క్రాఫ్టన్ సంస్థ నుండి భారత్ లోని మా అభిమానుల కోసం "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా" ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని భారతీయ అభిమానులు మరియు గేమర్స్, అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని పొందుతారని తెలిపాడు.

ఇప్పటికే 40 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదు అయినట్లు "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా" డెవలపర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. గేమ్ ని విడుదల చేసిన 24 గంటల్లోనే, "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా" గూగుల్ ప్లే స్టోర్‌లో అధిక వసూళ్లు చేసిన గేమ్‌గా నిలిచి ఫ్రీ ఫైర్‌ ను అధిగమించింది. ప్రస్తుతం, గేమ్ ప్లే స్టోర్‌లో "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా" 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. గతంలో పబ్జి కి ఉన్న స్పందన ఇప్పుడు "బ్యాటిల్ ఫీల్డ్ మొబైల్ ఇండియా"కు రావడంతో క్రాఫ్టన్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. 

Tags:    

Similar News