iPhone 17 Series Expected Price: ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు వస్తున్నాయ్.. ఇండియాలో వీటి ధరలు ఎంత ఉండనున్నాయంటే..
iPhone 17 Series Expected Price: ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు వస్తున్నాయ్.. ఇండియాలో వీటి ధర ఎంతంటే?
iPhone 17 Series Expected Price: యాపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో iPhone 17 సిరీస్‌ను ప్రారంభించబోతోంది. అయితే యాపిల్ లవర్స్ ఇప్పటికే iPhone 17 కొత్త మోడల్స్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి డిజైన్ నుండి మొదలుపెడితే మెరుగైన పర్ఫామెన్స్, పెద్ద కెమెరా అప్‌గ్రేడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో చూడవచ్చని లీకు వీరులు చెబుతున్నారు. ఈసారి కొత్త సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ,ఐఫోన్ 17 ప్రో మాక్స్ వేరియంట్స్ లాంచ్ అవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఇండియాలో కొత్త ఐఫోన్‌లను చూసే అవకాశం ఉంది. యాపిల్ రెగ్యులర్ ప్యాట్రన్ ప్రకారం.. లాంచ్ ఈవెంట్ జరిగిన వారంలోపు ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఫోన్ డెలివరీ అవడం ప్రారంభమవుతుంది.
స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర ఈసారి కూడా రూ. 79,900 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్లస్ వేరియంట్‌ను రీప్లేస్ చేస్తూ వస్తోన్న ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ. 89,900 గా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,20,000 నుండి ప్రారంభమవుతుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే హై-ఎండ్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ. 1,45,000 గా ఉండే అవకాశం ఉంది.
ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏదైనా ఉంటే అది ఆ ఫోన్ డిజైన్ అనే టాక్ వినిపిస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్ చాలా సన్నగా ఉంటుందని అంచనా. ఫోన్ కేవలం 5.5 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. అదే కానీ జరిగితే 17 ఎయిర్ మోడల్ ఫోన్ ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఐఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. అన్ని మోడల్స్ ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్‌తో వస్తాయి.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. 17 ప్రోలో 6.3-అంగుళాల స్క్రీన్, ఐఫోన్ 17 ఎయిర్ 6.6-అంగుళాలు డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈసారి అన్ని మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఐఫోన్ 17, 17 ఎయిర్‌లో A19 చిప్ ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌లో A19 Pro చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది.
యాపిల్ ఈసారి కెమెరా సిస్టమ్‌లో కూడా పెద్ద అప్‌గ్రేడ్‌లను తీసుకురానుంది. ముఖ్యంగా ప్రో మోడల్‌లో కొత్త ఫీచర్లు రావచ్చు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ట్రిపుల్ 48 MP కెమెరా సెటప్‌ను ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌ను అందించే టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లోకి కొత్తగా రాబోయే ఐఫోన్స్ గురించి ముందే వివరాలు పసిగట్టి, లాంచింగ్ కంటే ముందే ఆ డీటేల్స్ లీక్ చేసే టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న వివరాలు మాత్రమే అనే విషయం మర్చిపోవద్దండోయ్.