iPhone SE 4 Launch Today: సమయం లేదు మిత్రమా.. మరికొన్ని గంటల్లో చౌకైన ఐఫోన్ లాంచ్..!
iPhone SE 4 Launch Today: ఐఫోన్ ప్రియుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. యాపిల్ చౌకైన ఐఫోన్‌ను ఈరోజు అంటే ఫిబ్రవరి 19న విడుదల చేయనుంది.
iPhone SE 4 Launch Today: సమయం లేదు మిత్రమా.. మరికొన్ని గంటల్లో చౌకైన ఐఫోన్ లాంచ్..!
iPhone SE 4 Launch Today: ఐఫోన్ ప్రియుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. యాపిల్ చౌకైన ఐఫోన్‌ను ఈరోజు అంటే ఫిబ్రవరి 19న విడుదల చేయనుంది. గతేడాది యాపిల్ ఇదే టైమ్ లైన్‌లో iPhone 16 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు చౌకైన యాపిల్ iPhone SE 4 మొబైల్ అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కొత్త ఐఫోన్ లాంచ్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
చాలా మంది కొత్త ఐఫోన్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి ఇది శుభవార్తే. ఈ తక్కువ బడ్జెట్ iPhone SE 4 మొబైల్ ఈరోజు అధికారికంగా లాంచ్ కానుంది. SE4 తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అవుతుంది. కంపెనీ 2022లో iPhone SE 3ని విడుదల చేసింది. ఇప్పుడు కొత్త ఐఫోన్ అనేక అప్‌డెడ్ ఫీచర్లతో వస్తోంది. iPhone SE 3 ఫోన్‌తో పోలిస్తే ఇందులో పెద్ద డిస్‌ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ ఉంటుంది.
iPhone SE 4 Launch Details
యాపిల్ CEO టిమ్ కుక్ ఇటీవల తన X ఖాతాలో 'కుటుంబంలోని కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉండండి' అని పోస్ట్ చేశారు. ఇక్కడ ఫోన్ పేరు ప్రస్తావించలేదు. అయితే యాపిల్ కుటుంబానికి ఈ కొత్త సభ్యుడు iPhone SE 4. తన పోస్ట్‌లో కొత్త ఐఫోన్‌ను ఫిబ్రవరి 19 న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫోన్ ధర ఇప్పటికే లీక్ అయింది.
iPhone SE 4 Price
iPhone SE 4 మొబైల్ ధర ఐఫోన్ 15 కంటే తక్కువగా ఉంటుంది. సమాచారం ప్రకారం.. ఫోన్ రూ. 43,490 ($499) ధరకు విడుదలయ్యే అవకాశం ఉంది. iPhone SE 4 దేశంలో రూ. 50,000 కంటే తక్కువ ధరతో అందుబాటులోకి రానుంది. ఐఫోన్ SE 4తో పాటు కంపెనీ కొత్త పవర్‌బీట్స్ ప్రో 2 ఇయర్‌బడ్‌లను కూడా విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అయితే, ఈ యాపిల్ లాంచ్ ఈవెంట్‌లో పరిచయం చేయనున్న ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.
iPhone SE 4 Features
ఐఫోన్ SE 4 స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఐఫోన్ డిస్‌ప్లే OLED ప్యానెల్‌పై తయారుచేశారు. ఈ డిస్‌ప్లే 460ppi పిక్సెల్ డెన్సిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ చవకైన iPhone SE 4 Bionic A18 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది. ముఖ్యంగా iPhone 16లో Bionic A18 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగానే ఐఫోన్ SE 4 కూడా 8GB RAM ఉంటుంది.
యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో iPhone SE 4 లాంచ్ కానుంది. మొబైల్‌లో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరా ఫ్లాష్‌లైట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.