iPhone SE 4: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బడ్జెట్ ఐఫోన్ ధర వచ్చేసింది
iPhone SE 4: యాపిల్ బడ్జెట్ iPhone SE 4 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 2025లో విడుదల చేసే అవకాశం ఉంది.
iPhone SE 4: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బడ్జెట్ ఐఫోన్ ధర వచ్చేసింది
iPhone SE 4: యాపిల్ బడ్జెట్ iPhone SE 4 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ఇంకొంతంది టెక్ న్యూస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఫోన్ వచ్చే వారమే విడుదలయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఈసారి iPhone SE 4లో చాలా పెద్ద మార్పులను చూడవచ్చు. యాపిల్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌ల సెగ్మెంట్‌లో iPhone SE 4 ఒక ప్రధాన అప్‌గ్రేడ్ అవుతుంది. ఫోన్‌లో బెజెల్-లెస్ డిస్‌ప్లే, ఫేస్ ఐడి, 48 మెగాపిక్సెల్ కెమెరా, A18 చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
ఐఫోన్ SE 4 ధర
ఐఫోన్ SE అనేది కంపెనీ బడ్జెట్ ఫోన్. కాబట్టి ఈ ఫోన్ గురించి చెప్పుకోదగిన హైలైట్స్‌లో ధర కూడా ఒకటి. 2022లో విడుదల చేసిన ఐఫోన్ SE ధర రూ.39,999 నుండి ప్రారంభమవుతుంది. కొత్త మోడల్ ధర దీని కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, యాపిల్ ఇతర ఐఫోన్ మోడల్స్ కంటే చాలా చౌకగా ఉంటుంది.
ఐఫోన్ SE 4 స్పెసిఫికేషన్స్
ఈసారి కంపెనీ ఐఫోన్ SE 4 డిజైన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుందని చెబుతున్నారు. అంటే పాత మోడల్ కంటే పెద్ద స్క్రీన్ సైజుతో ఈ డివైజ్ రానుంది. అలానే ఇకపై హోమ్ బటన్ ఉండదు. యాపిల్ ఐఫోన్ SE 4 ఫేస్ ఐడీకి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిజైన్ ఐఫోన్ 13, 14ని పోలి ఉంటుంది.
ఐఫోన్ SE 4 కెమెరాలో కూడా అప్‌గ్రేడ్‌ను చూడవచ్చు. ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ అప్‌డేట్ యాపిల్ ఎస్ఈ 12 మెగాపిక్సెల్ కెమెరా కంటే చాలా పెద్దది. ఈ కెమెరా వినియోగదారులకు అద్భుతమైన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఐఫోన్ SE 4లో యాపిల్ A18 చిప్ ఉండే అవకాశం ఉంది. ఇదే చిప్ ఐఫోన్ 16లో కూడా ఉంటుంది. ఈ ఫోన్ ధర ఇతర ఐఫోన్‌ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఫ్లాగ్‌షిప్ రేంజ్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.