Anti-Tobacco warnings: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ హెచ్చరికలు లేదంటే బ్యాన్..!

Anti-Tobacco warnings: పొగాకు, సిగరెట్ల 2004 నిబంధనలని సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-05-31 14:00 GMT

Anti-Tobacco warnings: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ హెచ్చరికలు లేదంటే బ్యాన్..!

Anti-Tobacco warnings: దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకనుంచి ఓటీటీలో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా వేయాలని నిర్ణయించింది. పొగాకు, సిగరెట్ల 2004 నిబంధనలని సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఓటీటీల్లో ప్రదర్శించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే తప్పనిసరిగా హెచ్చరికలు జారీ చేయాల్సిందే.

ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే సదరు ఓటీటీ పబ్లిషర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేటప్పుడు పొగతాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఎలా ప్రదర్శిస్తారో అదే విధంగా ఓటీటీల్లోను ప్రదర్శించాలని ఆదేశించింది. 30 సెకన్లపాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా యాడ్స్‌ ప్రదర్శించాలని సూచించింది. అలాగే పొగాకు ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను కూడా చూపించాలని తెలిపింది. ఈ విషయం నిబంధనలకు తగ్గట్లుగానే తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని పేర్కొంది. ఇది కచ్చితంగా సినిమా కానీ ఏదైనా కార్యక్రమం కానీ ఏ భాషలో అయితే ప్రదర్శితం అవుతుందో అదే భాషలో ఉండాలని హెచ్చరించింది.

Tags:    

Similar News