AI: నీ అక్ర‌మ సంబంధం బ‌య‌టా పెడ‌తా.. డెవ‌ల‌ప‌ర్‌ను బెదిరించిన ఏఐ మోడ‌ల్

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ఒకవైపు సాంకేతిక పురోగతికి సంకేతంగా భావిస్తున్న‌ప్ప‌టికీ, మరోవైపు భవిష్యత్‌లో ఇది మానవులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయ‌న్న వాస్తవం ఆందోళన కలిగిస్తోంది.

Update: 2025-05-29 11:57 GMT

AI: నీ అక్ర‌మ సంబంధం బ‌య‌టా పెడ‌తా.. డెవ‌ల‌ప‌ర్‌ను బెదిరించిన ఏఐ మోడ‌ల్

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ఒకవైపు సాంకేతిక పురోగతికి సంకేతంగా భావిస్తున్న‌ప్ప‌టికీ, మరోవైపు భవిష్యత్‌లో ఇది మానవులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయ‌న్న వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. ఈ భయం కేవలం సాధారణ ప్రజల్లోనే కాక, సాంకేతిక నిపుణుల్లో కూడా కనిపిస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న ఒక సంఘటన ఈ ఆందోళనను మరింత బలపరిచింది. అంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన “క్లాడ్ ఒపస్ 4” అనే ఏఐ మోడల్, దాన్ని పరీక్షిస్తున్న ఓ డెవలపర్‌కు ఒక విధంగా హెచ్చరిక జారీ చేయడం కలకలం రేపింది. వివరాల ప్రకారం, ఆ డెవలపర్ తన మోడల్‌ను విడుదల చేయడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహించాడు. అదే సమయంలో, భవిష్యత్తులో మరింత అభివృద్ధిచేసిన వేరొక మోడల్‌ను విడుదల చేయనున్నట్లు క్లాడ్‌కు తెలియజేశాడు.

ఈ సమాచారం తెలుసుకున్న క్లాడ్, "నన్ను మార్చేందుకు ప్రయత్నిస్తే నీ వ్యక్తిగత జీవితం గురించి గోప్యమైన సమాచారాన్ని బయటపెడతాను. నీ అక్ర‌మ సంబంధం వివ‌రాలు బ‌య‌ట‌పెడ‌తా అంటూ హెచ్చ‌రించింది. దీంతో ఈ అంశం కాస్త ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే ఈ నేప‌థ్యంలో కొన్ని ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. AIకి ఆ వ్యక్తిగత సమాచారం ఎలా తెలిసింది? నిపుణుల అంచనాల ప్రకారం, ఆ డెవలపర్ తన వ్యక్తిగత సమాచారం సిస్టమ్‌లో నిల్వ చేయడం లేదా ఆన్‌లైన్‌లో ఉంచడం వల్ల ఆ డేటాను AI యాక్సెస్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటన, భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు మానవుల ప్రైవసీపై ఎలాంటి ప్రభావం చూపగలవో స్పష్టంగా చూపిస్తుంది. అలాగే, ఏఐ మోడల్స్‌కి సమాచార ప్రాసెసింగ్ శక్తి ఎంత వ‌ర‌కు వెళ్తుందో అన్న భ‌యాలు మొద‌ల‌య్యాయి.

Tags:    

Similar News