iQOO 12 Price Drop: ఈ మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్..ఏకంగా రూ.14000 డిస్కౌంట్..!
iQOO 12 Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఈ ఏడాది ప్రారంభం నుంచే ఫుల్ జోష్ మీద ఉంది. ప్రతిరోజూ సరికొత్త డీల్స్‌ని తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది.
iQOO 12 Price Drop: ఈ మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్..ఏకంగా రూ.14000 డిస్కౌంట్..!
iQOO 12 Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఈ ఏడాది ప్రారంభం నుంచే ఫుల్ జోష్ మీద ఉంది. ప్రతిరోజూ సరికొత్త డీల్స్‌ని తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించేస్తుంది. తాజాగా సైట్‌లో iQOO 12పై ఉత్తమమైన డీల్ కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ ఫోన్‌పై రూ. 14,004 భారీ తగ్గింపును అందిస్తోంది. మీరు మీ పాత ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా బ్రాండ్‌లను మార్చాలని ఆలోచిస్తున్నా? ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iQOO 12 Offer
ఐక్యూ 12 దేశంలో రూ. 59,999కి లాంచ్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ. 45,995 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అంటే ఫోన్ పై రూ.14 వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అదనంగా మీరు HDFC బ్యాంక్ కార్డ్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 2,000 తగ్గింపును దక్కించుకోవచ్చు. దీంతో ఫోన్‌లో మొత్తం రూ.16,000 ఆదా చేసుకోవచ్చు. అలానే మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
iQOO 12 Features
ఐక్యూ 12 స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది అంతేకాకుంగా ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, HDR10+ తో వస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ iQOO 12లో కనిపిస్తుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి Q1 గేమింగ్ చిప్‌సెట్‌తో మరింత అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది మాత్రమే కాదు, హ్యాండ్‌సెట్‌లో పెద్ద 5000mAh బ్యాటరీ ఉంది, మీరు 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో నిమిషాల్లో ఛార్జ్ చేయచ్చు.